తెలుగు వచనములు
తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి. అవి ఏకవచనము, బహువచనము.
1. ఏకవచనము : ఒక వస్తువు లేదా వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము. ఉదాహరణ: రాముడు, వనము.
కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి. ఉదాహరణ: వరి, బంగారము, మొదలైనవి.
2. బహువచనము : రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి లేదా మనుషుల గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహువచనములుగా ఉపయోగించబడతాయి. ఉదాహరణ: పాలు, కందులు, పెసలు, మొదలైనవి.
సంస్కృతంలో వచనములు మూడు విధములుగా ఉన్నాయి.
- ఏకవచనము : ఒక సంఖ్యను తెలియజేసేది “ఏకవచనము”.
- ద్వివచనము : రెండు సంఖ్యను తెలియజేసేది “ద్వివచనము”.
- బహువచనము : మూడు అంతకు మించి అనంత సంఖ్యలను తెలియజేసేది “బహువచనము”
తెలుగు భాషలో ఏకవచనము, బహువచనములు మాత్రమే ఉన్నాయి.
- ఏకవచనము – ఒక వస్తువును గురుంచిగాని, ఒకే వ్యక్తిని గురించిగాని చెప్పినచో అది ఏకవచనమగును – పుస్తకము, బల్ల, రామరావు.
- బహువచనము – రెండుగాని అంతకంటే ఎక్కువ వస్తువులను గురించిగాని, ఇద్దరుగాని అంతకంటే ఎక్కువమంది వ్యక్తులను గురించిగాని చెప్పినచో అది బహువచనము – పుస్తకములు, బల్లలు, పూలు.
- నిత్య ఏకవచనము – పంటలు, లోహములు మొదలైనవి నిత్య ఏకవచనములగును – వరి, బియ్యము, ఇనుము, రాగి.
- నిత్య బహువచనము – ధాన్య వాచక శబ్దములు – కందులు, పెసలు, ఉలవలు.