వ్యాసరచన (Telugu Essay Writing)

వ్యాసరచన

వ్యాసరచన అనగా విషయమును విస్తరించి వ్రాయుట.  తెలుగులో మొట్టమొదటిసారిగా స్వామినేని ముద్దు నరసింహ నాయుడు గారు 1842లో “హితవాది” పత్రికకు “ప్రమేయం” అనే వ్యాసాన్ని వ్రాసేరు.  ఆధునిక ప్రక్రియలలో తొలుతగా ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.  వ్యాసరచన జ్జ్ఞానానికి, సృజనాశక్తికి, తార్కికమైన ఆలోచనలకు దోహదపడుతుంది.  వ్యాసమునకు ఆరు ప్రధాన అంగాలు.

  1. ప్రారంభం,
  2. నిర్వచనం లేదా విషయ నేపధ్యం,
  3. విషయ విశ్లేషణ,
  4. అనుకూల – ప్రతికూల అంశాలు,
  5. సూచనలు,
  6. ముగింపు. 

వ్యాసరచనకు భాష తీరు కూడా ముఖ్యమైనది.  సాధ్యమైనంతవరకూ భాషా దోషాలు లేకుండా వ్రాయడం నేర్చుకోవాలి. ముఖ్యంగా వ్యక్తులు, స్థలాలు, పుస్తకాలు, సంవత్సరాలు మొదలైనవాటిలో తప్పులు వ్రాయకుండా జాగ్రత్తపడాలి.  అలాగే విషయ వ్యక్తీకరణ లో కూడా జాగ్రత్తలు అవసరం.  పొడుగైన వాక్యాలు వాడితే స్పష్టత కోల్పోయి అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది. అందువలన చిన్న వాక్యాలు వ్రాయడం మంచిది. ముఖ్యంగా “కర్త” యొక్క వచనాన్నిబట్టి “క్రియ”ని చేర్చాలి.  ఇతర భాషా పదాలను సాధ్యమైనంత తక్కువ వాడాలి. ఉదాహరణకు “సక్సెస్” అనివ్రాసే బదులు “విజయం” అని వ్రాయడం మంచిది.  విషయ వ్యక్తీకరణ విషయానికొస్తే ఎందుకు, ఎవరికోసం లాంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించడం, సదరు విషయం గురించి కావలసిన వారందరితో మాట్లాడటం,సదరు విషయం గురించి చదవటం, పరిశీలించి, విశ్లేషించటం లాంటి నైపుణ్యాలు కూడా వ్యాసరచనకు అవసరమైనవే.  మనం వ్రాద్దామనుకున్న విషయాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఒకవిధమైన ఆలోచన పటం (Mind Map) తయారుచేసుకోవడం మంచిది.  సదరు విషయంలో ఎంపిక చేసుకున్న విషయంపై సంబంధించిన అంశాలు వాటి మధ్య ఉండే సంబంధాలు గురించి ఒక రేఖా చిత్రం (Graph) మాదిరి తయారు చేసుకోవాలి.  ఇలా చేయటం వలన సమగ్రంగా అంశాల ప్రాధాన్యత ఒక వరుస క్రమంలో వాటిని ఉపయోగించుకోవడం సులభతరమౌతుంది. ఈ విధమైన విశ్లేషణ జరిగిన పిమ్మట విషయ వ్యక్తీకరణకు స్పష్టత వస్తుంది.  విషయ వ్యక్తీకరణపై స్పష్టత వచ్చిన తర్వాత అభిప్రాయసేకరణ మంచిది.  

ఇప్పుడు ఒక ఉదాహరణగా పిల్లల మాసపత్రిక చందమామ గురించి వ్యాసం చదవండి

Scroll to Top