పద్య సౌరభాలు (Fragrance of Telugu Poetry)

భాగవతంలోని ముఖ్య ఘట్టాలలో కొన్నిపద్య సౌరభాలు

బామ్మర పోతన గారు

ఒకమారు శ్రీనాథ మహాకవి పోతన గారి వద్దకు వచ్చినపుడు వారి మధ్య జరిగిన సంభాషణలో పోతనగారితో పోతన గారు రచించిన భాగవతం రాజుగారికి అంకితమిమ్మని తద్వారా గొప్ప ధనరాశులు కానుకగా పొందవచ్చని పోతన గారికి నచ్చచెప్తూ చెప్పేరట.  మరి ఇద్దరూ గొప్ప కవులు కదా మనం మాటాడుకున్నట్లు మాట్లాడుకుంటారా ఏంటి అందుకే ఒక కంద పద్యం చాటువుగా చెప్పేరుట. అదేమిటంటే

కమ్మని గ్రంథం బొక్కటి

యిమ్ముగ నే నృపతికైన కృతి ఇచ్చిన కై

కొమ్మని యీ యరె అర్థం

బిమ్మహి దున్నంగ నేల ఇట్టి మహాత్ముల్

ఆ మాటలు విన్న పోతన గారు శ్రీనాధ మహాకవి గారికి సమాధానంగా తాను కూడా  ఉత్పలమాల పద్యం చాటువుగా సమాధానమిచ్చేరుట. ఇప్పుడు పోతనగారి చమత్కారాన్నీ పద్యనిర్మాణాన్నిపరిశీలిద్దాం.

బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్

గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్

హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ

ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై

ప్రతిపదార్ధం:-     బాల = గున్న, చిన్న; రసాల = మామిడి; సాల = చెట్టు; నవ = లేత; పల్లవ = చివుళ్ళు వలె; కోమల = కోమలమైన; కావ్య = కావ్యము అనెడి; కన్యకన్ = అమ్మాయిని; కూళలు = క్రూరులు, కుత్సితులు; కున్ = కు; ఇచ్చి = అప్పజెప్పి; ఆ = ఆ యొక్క; పడుపు = ప్యభిచారపు; కూడు = తిండి; భుజించుట = తినుట; కంటెన్ = కంటెను; సత్కవుల్ = మంచి కవులు; హాలికులు = వ్యవసాయదారుల; ఐనన్ = అయినను; ఏమి = పరవాలేదు; గహన = అడవుల; అంతర = లోపలి; సీమలన్ = ప్రాంతాలలో; కందమూల = కందదుంపలు; ఔద్దాలికులు = పుట్టతేనెలతో జీవించువారు; ఐనన్ = అయినను; ఏమి = పరవాలేదు; నిజ = తన; దార = భార్య; సుత = పిల్లల; ఉదరపోషణ = జీవిక; అర్థము = నిమిత్తము; ఐ = కోసము. 

 పద్యము యొక్క అర్ధ భావము:- గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో జీవించువా రైనప్పటికి తప్పులేదు.  

సందర్భం:- శ్రీనాథ మహాకవి భాగవతాన్ని రాజుకి అంకితమిమ్మని చెప్పటానికి పోతన ఇంటికి పల్లకి లో వెడుతున్నారు. పోతన కొడుకు పొలం దున్నుతున్నారు. శ్రీనాథుడు తన మహాత్మ్యము చూపుదాం అని ఒక పక్క పల్లకి బొంగు మోస్తున్న బోయీలను తొలగిపొమ్మన్నారు. ఆ బోయీలు లేకున్నా పల్లకి వెళ్తోంది. అది చూసి కొడుకు వింతపడగా, పోతన నాగలి కాడికి గట్టిన వెలపలి ఎద్దును తొలగించమన్నారు. ఆ ఎద్దు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది. శ్రీనాథుడు రెండో పక్క బోయీలను కూడ తొలగిపొమ్మన్నారు. ఏ బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది. పోతన లోపలి ఎద్దును సైతం తొలగించమన్నారు. ఏ ఎద్దు లేకుండానే గాలిలో తేలుతూ నాగలి పొలం దున్నుతోంది. ఆ దృశ్యము చూసి శ్రీనాథుడు పల్లకి దిగివచ్చి పోతనతో “హాలికులకు సేమమా?” అని పరిహాసమాడారు. వెంటనే పోతన ఆశువుగా ఇలా కవిత్వ పటుత్వపు పద్య రూపంలో సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సత్కవులు ఎవరో మరి? ఇది ప్రజల నాలుకలపై కలకాలంగా నానుతున్న కథ.

కాటుక కంటి నీరు

కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో

కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో

హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క

ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

ప్రతి పదార్ధము

కాటుక = కంటికి పెట్టుకొనెడి నల్లని అంజనము; కంటినీరు = కన్నీరు; చనుకట్టు = రవిక {చనుకట్టు – స్తనములపై కట్టుకొను బట్ట, రవిక}; పయిన్ = మీద; పడన్ = పడునట్లు; ఏలన్ = ఎందుకు, ఏడ్చెదో = ఏడుస్తున్నావు; కైటభదైత్యమర్దనుని = విష్ణుమూర్తికి {కైటభాసురుని చంపిన వాడు, విష్ణువు}; గాదిలి = ప్రియమైన; కోడల = కొడుకు పెండ్లామా {విష్ణువు కొడుకు బ్రహ్మ ఆయన భార్య వాణి}; ఓ = ఓ; మత్ = నా యొక్క; అంబ = తల్లి; ఓ = ఓ, హాటకగర్భురాణి = సరస్వతీదేవి {హాటకగర్భురాణి = హాటకగర్భు (హాటకము (బంగారము / హిరణ్యం) గర్భ (గర్భముగ కలవాడు), బ్రహ్మ} రాణి (భార్య), వాణి; నినున్ = నిన్ను; ఆకటికిన్ = ఆకలికి; కొనిపోయి = తీసుకెళ్ళి; ఆల్ల = ఆ; కర్ణాట కిరాట కీచకులు = కర్ణాట కిరాట కీచకులు; కున్ = కు; అమ్మన్ = అమ్ముకొనను; త్రిశుద్ధిగన్ = ఒట్టు {మనోవాక్కాయకర్మల శుద్ధ}; నమ్ము = సందేహించవద్దు; భారతీ = సరస్వతీదేవి {భారతి = ఈ లోకమునకు భరతముని చేత తేబడినది, సరస్వతి}.

సందర్భము

ఆంధ్రమహాభాగవతాన్ని రాజుకి అంకితం యిమ్మని, బమ్మెర పోతనను అనేక రకాలుగా వత్తిడి చేస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా. ఆ పైన వత్తిడి చేసేవారు సాక్షాత్తు శ్రీనాథ కవిసార్వభౌములు. పోతరాజు నలిగిపోతున్నాడు. అయినా శ్రీరామునికి తప్ప నరుల కెవ్వరికి అంకిత మివ్వను అంటున్నాడు. గంటం పట్టింది సంపాదించటానికి కాదు, నా నాగలి పెట్టేది మాకు చాలు అంటున్నాడు. అట్టి పరిస్థితులలో ఒకమారు దేవతా పీఠం వద్ద కలత మనసుతో వచ్చి కూర్చున్నాడు. సాక్షాత్తు తల్లి వాణి కన్నీరు కారుస్తూ ప్రత్యక్ష మైంది. చూసి తట్టుకోలేని బాధలో చెమర్చిన కన్నులతో పోతన్నగారి నోటివెంట ఈ పద్యం అలవోకగా జాలువారిందిట. ఆమె తృప్తిగా వెళ్ళింది. ఎలా అయితే నేమి ఈ పరమాద్భుతమైన చాటువు తెలుగువారికి దక్కింది.

భావము

నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు? ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ! బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! నిన్నుతీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!

మందార మకరంద మాధుర్యమునఁ దేలు

మందార మకరంద మాధుర్యమునఁ దేలు-

మధుపంబు వోవునే మదనములకు?      

నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-

రాయంచ సనునె తరంగిణులకు?

లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-

కోయిల చేరునే కుటజములకుఁ?

బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-

మరుగునే సాంద్ర నీహారములకు?

నంబుజోదర దివ్యపాదారవింద

చింతనామృతపానవిశేషమత్త

చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?

వినుతగుణశీల! మాటలు వేయు నేల?”

ప్రతి పదార్ధము

మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగము లందు; తూగు = ఊగెడి; రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; ఐ = అయ్యుండి; చొక్కు = మైమరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబుజోదరుడు – అంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టన గలవాడు), విష్ణువు}.
దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కిలిగా; మత్త = మత్తెక్కిన; చిత్తము = మనసు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములు గల; శీల = వర్తన గలవాడ; మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.

భావము:

సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”

సందర్భం:- 

తండ్రి హిరణ్యాక్షుడు “హరి గిరి అనకు” అన్నాడు. ప్రహ్లాదుడు నీతిశాలి కదా. గురువు చండామార్కులవారికి సమాధానం చెప్పాడు. వినుతగుణశీల అని సంబోధించాడు. ఆ సందర్భంలోది ఈ అమృత గుళిక. మాధుర్యానికే మాధుర్యం చేర్చే మధురాతి మధురమైన పద్యరత్న మిది మనసును మైమరిపింప జేసెడి మనందరి పోతన్న ఉత్తమోత్తమైన సీస పద్యం.   ప్రహ్లాదుడు తన తండ్రిని ఇలా సంబోధిస్తూ చెపుతున్నాడు. ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశించిపోతూ  ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా. స్వచ్చమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు, వంకల దరి చేరదు కదా. తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా. నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా. అలాగే ఇతర విషయాల పైకి నా చిత్తం వెళ్ళదు సుమా. 

ఎల్లశరీరధారులకు

ఎల్లశరీరధారులకు నిల్లను చీఁకటినూతిలోపలం

ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్ను లై ప్రవ

ర్తిల్లక సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం

దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!

ప్రతిపదార్ధము

ఎల్ల = సర్వ; శరీరధారుల్ = మానవుల {శరీరధారులు – దేహము ధరించినవారు, మానవులు}; కున్ = కు; ఇల్లు = నివాసము; అను = అనెడి; చీకటి = చీకటి; నూతి = నుయ్యికి; లోపలన్ = లోపలందు; త్రెళ్ళక = పడకుండగ; వీరున్ = వీళ్ళు; ఏమున్ = మేము; అను = అనెడి; మతిన్ = చిత్త; భ్రమణంబునన్ = వైకల్యముతో; భిన్నులు = భేదభావము గలవారు; ఐ = అయ్యి; ప్రవర్తిల్లక = తిరుగకుండగ; సర్వమున్ = అఖిలము; అతని = అతని యొక్క; దివ్య = అతిగొప్ప; కళా = అంశతో, మాయావిలాసముతో; మయము = నిండినది; అంచున్ = అనుచు; విష్ణున్ = నారాయణుని; అందున్ = అందు; ఉల్లమున్ = హృదయము; చేర్చి = చేర్చి; తారు = తాము; అడవిన్ = అడవిలో; ఉండుట = ఉండుట; మేలు = ఉత్తమము; నిశాచర = రాక్షసులలో; అగ్రణీ = గొప్పవాడ

భావము:-

“ఓ రాక్షసేశ్వరా! లోకులు అందరు అజ్ఞానంతో, ఇల్లనే చీకటిగోతిలో పడి తల్లడిల్లుతూ ఉంటారు; “నేను వేరు, ఇతరులు వేరు” అనే చిత్త భ్రమ భేద భావంతో ఉంటారు. అట్టి భేద భావంతో మెలగకుండా; విశ్వం అంతా విష్ణు దేవుని లీలా విశేషాలతో నిండి ఉంది అని గ్రహించాలి; అలా గ్రహించి ఆ విష్ణుదేవుని మనసులో నిలుపుకొని, తాము అడవులలో నివసించినా ఉత్తమమే.”

కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి

సందర్భము:- అది కురుక్షేత్రం మహా భారత యుద్ధంలో కౌరవ, పాండవ సేనల మధ్య భీకర పోరు జరుగుతున్న సమయం. రాధా, గజ, తురగ, పదాతి సైన్యం భీకరంగా యుద్ధం చేస్తున్న వేళ.  భీష్ముడు కౌరవ సేన సర్వ సైన్యాధ్యక్షుడిగా పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు.  భీష్ముని చందా, ప్రచండ ఉగ్ర రూపానికి అర్జునునితో సహా పాండవ సేన భీతిల్లింది.  అదిచూసి కృష్ణుని మనసు ద్రవించిపోయింది.  కృష్ణుడు అర్జునుని రాధా సారధి.  రథసారధ్యం మాత్రమే చేస్తానని ఆయుధము ధరించనని ప్రతిజ్ఞ చేసివున్నాడు.  భీష్ముడు మహాభక్తుడు.  కృష్ణ తత్వాన్ని ఎరిగినవాడు.  కృష్ణుడు ఎంత భక్తవశంకరుడో కూడా భీష్మునకు తెలుసు.  అర్జునుడంటే  కృష్ణునికి ప్రాణ సమానం.  అటువంటి అర్జునుణ్ణి రక్తసిక్తుణ్ణి  చేసి కృష్ణుణ్ణి అసహనానికి గురిచేసి తాను ఆయుధం పట్టణాన్ని చేసిన ప్రతిజ్ఞను మరిచిపోయేలా చేస్తాడు. పూర్తిగా గాయాలతో రక్తమోడుతున్నఅర్జునున్ని చూసిన కృష్ణుడు వెంటనే రాధా పగ్గాలు వదిలేసి రథంపైనుండి క్రిందికి దుముకుతాడు.  అలా దుమికినప్పుడు కృష్ణుని చెవులున్నా కుండలములు ఊగి వాటి కాంతి ఆకాశ మండలమంతా విస్తరించింది.  అథ కడుపులో ఉన్నా లోకాలన్నీ కదిలిపోయాయట.  పైన వేసుకున్న పచ్చని పాఠం జారిపోయింది.  ఆగ్రహోదగ్ధుడై చక్రం ధరియించి భీష్ముని చంపుతానని వెళుతున్నా కృష్ణుని చూసి అర్జునుడు వద్దుబావా….వద్దుబావా…. అంటూ కృష్ణుడి కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ ఆగు బావా నన్ను కదానభూమిలో నగుబాటు చేయొద్దు అని వేడుకున్నాడట.  ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ వర్ణించిన పద్యం ఇది. ఈ పద్యం భీష్ముడు అంపశయ్యపైనుండి కృష్ణుణ్ణి స్తుతిస్తూ చెప్పిన పద్యంగా తోస్తుంది.  

సీ. కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;

గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;

జగముల వ్రేఁగున జగతి గదలఁ;

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;

 బైనున్న పచ్చనిపటము జాఱ;

నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;

 మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;

తే. గీ   గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి

నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు

విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

ప్రతిపదార్ధము:- కుప్పించి = దుమికి; యెగసినన్ = పరుగెడుతుండగ; కుండలంబుల = (చెవి) కుండలముల యొక్క; కాంతిన్ = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్ = సమస్తము; కప్పికొనఁగన్ = నిండిపోగా; ఉఱికిన = దుముకిన; ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు = పొట్ట; లోన్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; జగముల = జగత్తుల; వ్రేఁగున = వడి వలన; జగతి = భూమి; కదలన్ = కదలగా; చక్రంబున్ = చక్రమును; చేన్ = చేత; పట్టి = పట్టి; చనుదెంచు = వచ్చుచున్న; రయమునన్ = వేగమువలన; పైన = పైన; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చని; పటము = బట్ట; జాఱన్ = జారగ; నమ్మితిన్ = నమ్ముకొంటిన; నా = నాయొక్క; లావున్ = పరువును; నగుఁబాటు = నవ్వులపాలు; సేయకన్ = చేయకుము; మన్నింపుము = మన్నించుము; అని = అని; క్రీడి = అర్జునుడు; మరలన్ = వెనుకకు; దిగువన్ = లాగుచుండగా; కరి = ఏనుగు; కి = కొరకు; లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెఱసి = ప్రకాశించుచు; నేఁడు = ఈవేళ; భీష్మునిన్ = భీష్ముని; చంపుదున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచున్ = అనుచూ; మత్ = నాయొక్క; విశిఖ = బాణముల; వృష్టిన్ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చు; దేవుండు = దేవుడు; దిక్కు = శరణమగుగాక; నాకు = నాకు.కుప్పించి = దుమికి; యెగసినన్ = పరుగెడుతుండగ; కుండలంబుల = (చెవి) కుండలముల యొక్క; కాంతిన్ = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్ = సమస్తము; కప్పికొనఁగన్ = నిండిపోగా; ఉఱికిన = దుముకిన; ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు = పొట్ట; లోన్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; జగముల = జగత్తుల; వ్రేఁగున = వడి వలన; జగతి = భూమి; కదలన్ = కదలగా; చక్రంబున్ = చక్రమును; చేన్ = చేత; పట్టి = పట్టి; చనుదెంచు = వచ్చుచున్న; రయమునన్ = వేగమువలన; పైన = పైన; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చని; పటము = బట్ట; జాఱన్ = జారగ; నమ్మితిన్ = నమ్ముకొంటిన; నా = నాయొక్క; లావున్ = పరువును; నగుఁబాటు = నవ్వులపాలు; సేయకన్ = చేయకుము; మన్నింపుము = మన్నించుము; అని = అని; క్రీడి = అర్జునుడు; మరలన్ = వెనుకకు; దిగువన్ = లాగుచుండగా; కరి = ఏనుగు; కి = కొరకు; లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెఱసి = ప్రకాశించుచు; నేఁడు = ఈవేళ; భీష్మునిన్ = భీష్ముని; చంపుదున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచున్ = అనుచూ; మత్ = నాయొక్క; విశిఖ = బాణముల; వృష్టిన్ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చు; దేవుండు = దేవుడు; దిక్కు = శరణమగుగాక; నాకు = నాకు.కుప్పించి = దుమికి; యెగసినన్ = పరుగెడుతుండగ; కుండలంబుల = (చెవి) కుండలముల యొక్క; కాంతిన్ = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్ = సమస్తము; కప్పికొనఁగన్ = నిండిపోగా; ఉఱికిన = దుముకిన; ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు = పొట్ట; లోన్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; జగముల = జగత్తుల; వ్రేఁగున = వడి వలన; జగతి = భూమి; కదలన్ = కదలగా; చక్రంబున్ = చక్రమును; చేన్ = చేత; పట్టి = పట్టి; చనుదెంచు = వచ్చుచున్న; రయమునన్ = వేగమువలన; పైన = పైన; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చని; పటము = బట్ట; జాఱన్ = జారగ; నమ్మితిన్ = నమ్ముకొంటిన; నా = నాయొక్క; లావున్ = పరువును; నగుఁబాటు = నవ్వులపాలు; సేయకన్ = చేయకుము; మన్నింపుము = మన్నించుము; అని = అని; క్రీడి = అర్జునుడు; మరలన్ = వెనుకకు; దిగువన్ = లాగుచుండగా; కరి = ఏనుగు; కి = కొరకు; లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెఱసి = ప్రకాశించుచు; నేఁడు = ఈవేళ; భీష్మునిన్ = భీష్ముని; చంపుదున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచున్ = అనుచూ; మత్ = నాయొక్క; విశిఖ = బాణముల; వృష్టిన్ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చు; దేవుండు = దేవుడు; దిక్కు = శరణమగుగాక; నాకు = నాకు.

భావము: ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది. కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది. “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ”ద్దని మాటి మాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే ఆ గోపాల దేవుడే నాకు రక్ష.

Poem:కుప్పించి ఎగసిన

Movie:Bhishma

Cast:NTR, Anjali devi

Singer:Ghantasala

Music:Saluri Rajeshwara Rao