రేఫలు, తాలవ్యములు – దంత్యములు, బిందువు

  • రేఫలు
  • తాలవ్యములు – దంత్యములు
  • బిందువు

రేఫలు

రేఫము సాధురేఫమనియు శకటరేఫమనియు రెండు విధములు. ఇది సంస్కృత భాషయందు లేదు. కేవలము ఆంధ్ర భాషయందు మిక్కిలి పరిపాటిగా చూడబడుచున్నది. కాని తత్సమ శబ్దమయమైన ఆంధ్ర భాషయందు ర ఱ ల భేదము కనుగొనుట మిక్కిలి కష్టము. ఇతర ప్రయోజనము ఎట్లున్నను సంస్కృతాంధ్ర శబ్ద పరిజ్ఞానమునకు మాత్రమిది ఉపయోగము. ద్విత్త్వముతో కూడు కొన్నవియు వాని రూపాంతరములును శకటరేఫలు.

  • మొఱ్ఱ – మొఱ
  • బొఱ్ఱి – బొఱియ
  • చుఱ్ఱు – చుఱచుఱ
  • గుఱ్ఱు – గుఱగుఱ
  • గొఱ్ఱి – గొఱియ
  • పుఱ్ఱె – పుఱియ
  • కఱ్ఱి – కఱియ
  • కిఱ్ఱు – కిఱకిఱ
  • బఱ్ఱు – బఱబఱ
  • పఱ్ఱు – పఱపఱ

శకట రేఫలు సంయుక్తములు కావు.

  • చఱువు – మెఱసె.
  • మఱువు – వెఱచె.
  • ఒఱుపు – అఱుపు.
  • అఱచ – పిఱుదు.
  • పఱచె – అఱకలు.
  • అడు – ఉవు – ఉము – అంతమందు గల శబ్దములు శకటరేఫలు.
  • కఱడు – కఱువు – ఉఱుము
  • ఒఱడు – మఱువు – మెఱుము.
  • పెఱడు – చెఱువు – మఱుము.

అన్యవర్ణములతో సంయుక్తములైయున్న శబ్దములు శకటరేఫలుగావు.

  • తనర్చె – పొనర్చె – ఒనర్చె.

తాలవ్యములు – దంత్యములు

తాలవ్యములు – దంత్యములు – అని చ – జ లు రెండు విధములు

ఇ – ఈ – ఎ – ఏ అను అచ్చులతో కూడియున్న చ – జ లు తాలవ్యములు.

: చిగురు – చీర – చెలిమి – చేడియ – జిగి – జీతము – జెండా – జేన – మొదలైనవి.

అ – ఆ – ఉ – ఊ – ఒ – ఓ -ఔ – అను అచ్చులతో కూడియున్న చ జ లు దంత్యములు.

:- చమురు – ఛాకలి – చుంచు – చూలు – చొళ్లెము – చోడి – చౌదంతి – జత – జాతర – జుట్టు – జూదము – జొంపము – జోదు – జౌకు – తాలవ్య చ – జ లకు చెప్పిన కార్యములన్నియు దంత్య చ – జ లకు కూడా వచ్చుచుండును. చ కారముతో పాటు ఛకారము కూడ పరుష సంజ్ఞ కలది యగుచున్నవి. ఇట్లే జ కారముతో పాటు జ కారముకూడ సరళ సంజ్ఞ కలదియగుచున్నది. దంత్యతాలవ్యములగు చ – జ లను పరస్పరము యతి ప్రాసలకు కూర్చవచ్చును. అందువల్ల దంత్యతాలవ్యములైన చ జ లను సవర్ణములనుచున్నారు.

బిందువు

తెలుగు భాషయందు బిందువులు రెండు విధములు అవి పూర్ణ బిందువు, ఖండ బిందువులు.

:- కంచె – గంటము – వంట – పూర్ణ బిందువులు.

తోఁట – కోఁతి – ఖండ బిందువులు.

సిద్ధము – సాధ్యము – అని బిందువులు రెండు రకములు.

శబ్దములందు స్వతసిద్దముగానున్న బిందువులు సిద్ధబిందువులు.

ఉదా:- మంద – మంట – కాపురము – దూట – మొదలైనవి.

వ్యాకరణ సూత్రమువల్ల కలుగు బిందువులు సాధ్యబిందువులు.

బిందువుండును కాని, యితర వర్ణములకు పూర్వమందు బిందువుండదు. “కంసాలి జాతివాడు చాలలేడు” అని ప్రయోగం కనపడుచున్నది. వ్యాజ్యెము – ర్యాలి – (ఒక గ్రామము – పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా లోనిది) మున్నగు లెక్కకు వచ్చు కొన్ని పదములలో తప్ప  రేఫేతర హల్లుతో సంయుక్తమైన వర్ణము తెలుగులో పదాదినుండదు