- రేఫలు
- తాలవ్యములు – దంత్యములు
- బిందువు
రేఫలు
రేఫము సాధురేఫమనియు శకటరేఫమనియు రెండు విధములు. ఇది సంస్కృత భాషయందు లేదు. కేవలము ఆంధ్ర భాషయందు మిక్కిలి పరిపాటిగా చూడబడుచున్నది. కాని తత్సమ శబ్దమయమైన ఆంధ్ర భాషయందు ర ఱ ల భేదము కనుగొనుట మిక్కిలి కష్టము. ఇతర ప్రయోజనము ఎట్లున్నను సంస్కృతాంధ్ర శబ్ద పరిజ్ఞానమునకు మాత్రమిది ఉపయోగము. ద్విత్త్వముతో కూడు కొన్నవియు వాని రూపాంతరములును శకటరేఫలు.
- మొఱ్ఱ – మొఱ
- బొఱ్ఱి – బొఱియ
- చుఱ్ఱు – చుఱచుఱ
- గుఱ్ఱు – గుఱగుఱ
- గొఱ్ఱి – గొఱియ
- పుఱ్ఱె – పుఱియ
- కఱ్ఱి – కఱియ
- కిఱ్ఱు – కిఱకిఱ
- బఱ్ఱు – బఱబఱ
- పఱ్ఱు – పఱపఱ
శకట రేఫలు సంయుక్తములు కావు.
- చఱువు – మెఱసె.
- మఱువు – వెఱచె.
- ఒఱుపు – అఱుపు.
- అఱచ – పిఱుదు.
- పఱచె – అఱకలు.
- అడు – ఉవు – ఉము – అంతమందు గల శబ్దములు శకటరేఫలు.
- కఱడు – కఱువు – ఉఱుము
- ఒఱడు – మఱువు – మెఱుము.
- పెఱడు – చెఱువు – మఱుము.
అన్యవర్ణములతో సంయుక్తములైయున్న శబ్దములు శకటరేఫలుగావు.
- తనర్చె – పొనర్చె – ఒనర్చె.
తాలవ్యములు – దంత్యములు
తాలవ్యములు – దంత్యములు – అని చ – జ లు రెండు విధములు
ఇ – ఈ – ఎ – ఏ అను అచ్చులతో కూడియున్న చ – జ లు తాలవ్యములు.
ఉ: చిగురు – చీర – చెలిమి – చేడియ – జిగి – జీతము – జెండా – జేన – మొదలైనవి.
అ – ఆ – ఉ – ఊ – ఒ – ఓ -ఔ – అను అచ్చులతో కూడియున్న చ జ లు దంత్యములు.
ఉ:- చమురు – ఛాకలి – చుంచు – చూలు – చొళ్లెము – చోడి – చౌదంతి – జత – జాతర – జుట్టు – జూదము – జొంపము – జోదు – జౌకు – తాలవ్య చ – జ లకు చెప్పిన కార్యములన్నియు దంత్య చ – జ లకు కూడా వచ్చుచుండును. చ కారముతో పాటు ఛకారము కూడ పరుష సంజ్ఞ కలది యగుచున్నవి. ఇట్లే జ కారముతో పాటు జ కారముకూడ సరళ సంజ్ఞ కలదియగుచున్నది. దంత్యతాలవ్యములగు చ – జ లను పరస్పరము యతి ప్రాసలకు కూర్చవచ్చును. అందువల్ల దంత్యతాలవ్యములైన చ జ లను సవర్ణములనుచున్నారు.
బిందువు
తెలుగు భాషయందు బిందువులు రెండు విధములు అవి పూర్ణ బిందువు, ఖండ బిందువులు.
ఉ:- కంచె – గంటము – వంట – పూర్ణ బిందువులు.
తోఁట – కోఁతి – ఖండ బిందువులు.
సిద్ధము – సాధ్యము – అని బిందువులు రెండు రకములు.
శబ్దములందు స్వతసిద్దముగానున్న బిందువులు సిద్ధబిందువులు.
ఉదా:- మంద – మంట – కాపురము – దూట – మొదలైనవి.
వ్యాకరణ సూత్రమువల్ల కలుగు బిందువులు సాధ్యబిందువులు.
బిందువుండును కాని, యితర వర్ణములకు పూర్వమందు బిందువుండదు. “కంసాలి జాతివాడు చాలలేడు” అని ప్రయోగం కనపడుచున్నది. వ్యాజ్యెము – ర్యాలి – (ఒక గ్రామము – పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా లోనిది) మున్నగు లెక్కకు వచ్చు కొన్ని పదములలో తప్ప రేఫేతర హల్లుతో సంయుక్తమైన వర్ణము తెలుగులో పదాదినుండదు