ప్రకృతి – వికృతులు (Prakruti Vikrutulu)

ప్రకృతి – వికృతి

‘ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు’ – అని మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాషనుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణ వేత్తలు తెలియచేశారు.

సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది.  తెలుగు భాషలో చాలా ప్రకృతి వికృతులుగా ఉన్నాయి. తెలుగు నిఘంటువులు వీటిని ఆకారాది క్రమంలో చూపిస్తాయి.  తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:

ప్రకృతివికృతి
అంబఅమ్మ
అక్షరముఅక్కరము
అగ్నిఅగ్గి
అద్భుతము, అపూర్వముఅబ్బురము
అనాదఅనద
అమావాస్యఅమవస
ఆకాశముఆకసము
ఆదారముఆదరువు
ఆశఆస
ఆశ్చర్యముఅచ్చెరువు
ఆహారముఓగిరము
ఆజ్ఞఆన
 కథకత
కన్యకన్నె
  కవికయి
కార్యముకర్జము
కుంతిగొంతి
కుమారుడు  కొమరుడు
కుఠారముగొడ్డలి
కులముకొలము
కృష్ణుడుకన్నడు
ఖడ్గముకగ్గము
గ్రహముగాము
గృహముగీము
గుణముగొనము
గౌరవముగారవము
ఘోరముగోరము
చంద్రుడు చందురుడు 
చోద్యంసోదెము
జ్యోతిజోతి
జ్యోతిషముజోస్యము
తంత్రముతంతు
తరంగముతరంగ  
తర్కారితక్కెడ
  త్యాగంచాగం
తీరముదరి
దిశదెస
దీపముదివ్వె
ద్వీపముదీవి
దుఃఖముదూకవి
దైవందయ్యము
దృఢముదిటము
ధర్మముదమ్మము
ధాతతార
నిత్యమునిచ్చలు
నిద్రనిదుర
నిమిషమునిముసం
నిశానిసి
నీరమునీరు
న్యాయమునాయము
పక్షిపక్కి
పద్యముపద్దెము
పరుషం  ఫరుసం
పర్వంపబ్బం
  పశువు పసరము
ప్రజపజ
ప్రతిజ్ఞప్రతిన
ప్రశ్నముపన్నము
ప్రాకారముప్రహరి
ప్రాణముపానము
పుత్రుడుబొట్టి
పుణ్యముపున్నెము
పురిప్రోలు
పుస్తకముపొత్తము
పుష్పముపూవు
ప్రేప్రేముడి
బంధువుబందుగు
బలముబలుపు
బహువుపెక్కు
బ్రహ్మబమ్మ, బొమ్మ
బిలముబెలము
భక్తిబత్తి
భగ్నముబన్నము
భద్రముపదిలము
భాగ్యముబాగెము
భారముబరువు
భాషబాస
భీతిబీతు
భుజముభుజము
భూమిబువి
భేదముబద్ద 
మంత్రముమంతరము
మతిమది
మర్యాదమరియాద
మల్లి, మల్లికమల్లి, మల్లిక
ముకుళముమొగ్గ
ముక్తిముత్తి
ముఖముమొగము
ముగ్ధముగుద
మూలికమొక్క
మేఘుడుమొగులు, మొయిలు
మృగముమెకము
యంత్రముజంత్రము
యత్నంజతనం
యాత్రజాతర
యువతిఉవిద
రాత్రిరాతిరి
రిక్తమురిత్త
రూపమురూపు
లక్ష్మిలచ్చి
వశమువసము
వర్ణమువన్నె
విద్యవిద్దె
విధమువితము
విజ్ఞానమువిన్నాణము
వేగమువేగిరము
వేషమువేసము
వైద్యుడువెజ్జ
వృద్ధపెద్ద
వృద్ధివద్ది
శక్తిసత్తి
శయ్యసెజ్జ
శాస్త్రముచట్టము
శిఖాసిగ
శిరము సీరము 
శీతముసీతువు
శ్రీసిరి 
శుచిచిచ్చు
సంతోషముసంతసము 
సందేశముసందియము
సత్యముసత్తెము
సముద్రముసంద్రము
సాక్షిసాకిరి
సింహముసింగము
సంధ్యసంజ, సందె
స్తంభముకంబము
స్త్రీఇంతి
స్థలముతలము