వినాయక పూజ (Vinayaka Puja)

వినాయక పూజ

వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరొత్తులు వెలిగించుకోవాలి.

ఆచమనం:- ఆచమనము అనే పదానికి ఉపస్పర్శం అంటే అరచేతిలో నీరు పోసుకొని నోటితో గ్రహించడమని అర్ధం. ఏదైనా ఒక పవిత్రమైన పనిచేస్తున్నప్పుడు ఆచమనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనస్సు, వాక్కు, శరీరం – అనే త్రికరణాల పవిత్రతకు ఆచమనం విధించబడింది. ఆవిధంగా కేశవాదినామాలతో ఆచమనం చేయాలి అనగా ఓం కేశవాయ స్వాహాః నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః అనుముడు నామాలు చెప్పినపుడు మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను. పిమ్మట మిగిలిన నామాలను అనగా గోవిందాయ నమః  విష్ణవే నమః  మధుసూదనాయ నమః  త్రివిక్రమాయ నమః  వామనాయ నమః  శ్రీధరాయ నమః  హృషీకేశాయ నమః  పద్మనాభాయ నమః  దామోదరాయ నమః  సంకర్షణాయ నమః  వాసుదేవాయ నమః  ప్రద్యుమ్నాయ నమః  అనిరుద్దాయ నమః  పురుషోత్తమాయ నమః  అధోక్షజాయ నమః  నారసింహాయ నమః  అచ్యుతాయ నమః  ఉపేంద్రాయ నమః  హరయే నమః  శ్రీ కృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః  అని నామాలు చెప్పుట పూర్తిచేసి గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను

యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం…1

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ:

యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన: …2

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం …3

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే

శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.  …4

పిమ్మట ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు   అని చెప్తూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.  తర్వాత ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే అని చెప్తూ  అక్షతలు వెనుక వేసుకొనవలెను.పిమ్మట మూడుమార్లు ప్రాణాయామం చేయవలెను.

ప్రాణాయామమనగా – గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

ఓం మాపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్|

మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను. అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు సుద్ధి చేసినట్టుగా చల్లవలెను. ఇప్పుడు సంకల్పము చెప్పవలెను.

సంకల్పమనగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.  మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే, శ్రీ మహా విష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. అని చెప్పి నీరు ముట్టుకొనవలెను.   ఇప్పుడు గణనాధుని ఈ క్రింది విధంగా ప్రార్ధిస్తూ షోడశోపచారంచేయవలెను.

 ప్రార్ధన

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచారపూజ:-                  

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥  శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం

ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ఆర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన

పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో

ఆచమనీయం సమర్పయామి.

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి.

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత

పంచామృత స్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే

శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక.

ఉపవీతం సమర్పయామి.

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం

గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే  అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే

పుష్పాణి పూజయామి.

అథాంగ పూజ(పుష్పములతో పూజించవలెను)

  • గణేశాయ నమః – పాదౌ పూజయామి (పాదములు)
  • ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి (చీలమండలు)     
  • శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి (మోకాలు)
  • విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి (పిక్కలు )
  • అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి (తొడలు)
  • హేరంబాయ నమః – కటిం పూజయామి (మొల)
  • లంబోదరాయ నమః – ఉదరం పూజయామి (కడుపు)
  • గణనాథాయ నమః – నాభిం పూజయామి (బొద్దు)
  • గణేశాయ నమః – హృదయం పూజయామి (వక్షము)
  • స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి (కంఠము)
  • గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి (నోరు)
  • విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి(కన్నులు)
  • శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి(చెవులు)
  • ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి (నుదురు)
  • సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి (శిరసు)
  • విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి (మొత్తం శరీరమంతా)

ఏకవింశతి పత్ర పూజ:- వినాయకుని 21 రకముల పత్రములు- ఆకులతో పూజించాలి. సంస్కృత పదము పక్కనే ఆ పత్రానికి వున్న తెలుగు పేరు కూడా ఇవ్వడమైనది. కొన్ని రకముల పత్రములు దొరకకపోతే ఆ సందర్బమున వేరొక పత్రములను వాడవచ్చును. ఇందులో కొన్ని పత్రములు సాధారణముగా పూజకు వాడనివి. కాని వినాయక చవితి

రోజున అవి వాడుటకు అనుమతింపబడియున్నవి.

  1. ఓం సుముఖాయ నమ: మాచీపత్రం సమర్పయామి (మాచిపత్రి)
  2. ఓం గణాధిపాయ నమ: బృహతీపత్రం సమర్పయామి (వాకుడు/ ములగ)
  3. ఓం ఉమాపుత్రా య నమ: బిల్వపత్రం సమర్పయామి (మారేడు)
  4. ఓం గజాననాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి (గరికలు)
  5. ఓం హరసూనవే నమ: దత్తూర పత్రం సమర్పయామి (ఉమ్మెత్త)
  6. ఓం లంబోదరాయ నమ: బృదరీపత్రం సమర్పయామి (రేగు)
  7. ఓం గుహాగ్రజాయ నమ: అపామార్గపత్రం సమర్పయామి (ఉత్తరేణి)
  8. ఓం గజకర్ణాయ నమ: తులసీ పత్రం సమర్పయామి (తులసి)
  9. ఓం ఏకదంతాయ నమ: చూతపత్రం సమర్పయామి (మామిడి)
  10. ఓం వికటాయ నమ: కరవీపత్రం సమర్పయామి (గన్నేరు)
  11. ఓం భిన్నదంతాయ నమ: విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (విష్ణుకాంత)
  12. ఓం వటవే నమ: దాడిమీ పత్రం సమర్పయామి (దానిమ్మ)
  13. ఓం సర్వేశ్వరాయ నమ: దేవదారు పత్రం సమర్పయామి (దేవదారు)
  14. ఓం ఫాలచంద్రాయ నమ: మరువక పత్రం సమర్పయామి (మరువం)
  15. ఓం హేరంబాయ నమ: సింధువార పత్రం సమర్పయామి (వావిలి)
  16. ఓం శూర్పకర్ణాయ నమ: జాజీపత్రం సమర్పయామి (జాజి)
  17. ఓం సురాగ్రజాయ నమ: గండకీపత్రం సమర్పయామి (ఏనుగుచెవి ఆకు)
  18. ఓం ఇభవక్త్రాయ నమ: శమీపత్రం సమర్పయామి (జమ్మి)
  19. ఓం వినాయకాయ నమ: అశ్వత్థపత్రం సమర్పయామి (రావి)
  20. ఓం సురసేవితాయ నమ: అర్జునపత్రం సమర్పయామి (మద్ది)
  21. ఓం కపిలాయ నమ: అర్కపత్రం సమర్పయామి (జిల్లేడు)

తర్వాత అష్టోత్తర శతనామావళితో గణేశుని పూజించాలి.

అష్టోత్తర శతనామ పూజ (పుష్పములు, మిగిలిన పత్రి, అక్షతలతో ఒక్కొక్క నామము చదువుతూ వినాయకుని పూజించాలి)

  1. ఓం గజాననాయ నమ:
  2. ఓం గణాధ్యక్షాయ నమ:
  3. ఓం విఘ్నరాజాయ నమ:
  4. ఓం వినాయకాయ నమ:
  5. ఓం దైమాతురాయ నమ:
  6. ఓం ద్విముఖాయ నమ:
  7. ఓం ప్రముఖాయ నమ:
  8. ఓం సుముఖాయ నమ:
  9. ఓం కృతినే నమ:
  10. ఓం సుప్రదీపాయ నమ:
  11. ఓం సుఖనిధయే నమ:
  12. ఓం సురాధ్యక్షాయ నమ:
  13. ఓం మంగళస్వరూపాయ నమ:
  14. ఓం ప్రమదాయ నమ:
  15. ఓం ప్రథమాయ నమ:
  16. ఓం ప్రాజ్ఞాయ నమ:
  17. ఓం విఘ్నకర్త్రే నమ:
  18. ఓం విఘ్నహంత్రే నమ:
  19. ఓం విశ్వనేత్రే నమ:
  20. ఓం విరాటత్పయే నమ:
  21. ఓం శ్రీపతయే నమ:
  22. ఓం వాక్పతయే నమ:
  23. ఓం శృంగారిణ నమ:
  24. ఓం ఆశ్రి త వత్సలాయ నమ:
  25. ఓం మంత్రకృతే నమ:
  26. ఓం చామీకర ప్రభాయ నమ:
  27. ఓం సర్వాయ నమ:
  28. ఓం సర్వోపన్యాసాయ నమ:
  29. ఓం సర్వకర్త్రే నమ:
  30. ఓం సర్వనేత్రే నమ:
  31. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమ:
  32. ఓం సర్వసిద్ధయే నమ:
  33. ఓం పంచ హస్తాయ నమ:
  34. ఓం పార్వతీనందనాయనమ:
  35. ఓం ప్రభవే నమ:
  36. ఓం కుమారగురవే నమ:
  37. ఓం సురారిఘ్నాయ నమ:
  38. ఓం మహాగణపతయే నమ:
  39. ఓం శివప్రియాయ నమ:
  40. ఓం శీఘ్రకారిణ నమ:
  41. ఓం శాశ్వతాయ నమ:
  42. ఓం భవాయ నమ:
  43. ఓం బలోత్థితాయనమ:
  44. ఓం భవాత్మజాయ నమ:
  45. ఓం పురాణ పురుషాయ నమ:
  46. ఓం పూష్ణే నమ:
  47. ఓం మాన్యాయ నమ:
  48. ఓం మహాకాలాయ నమ:
  49. ఓం మహాబలాయ నమ:
  50. ఓం హేరంబాయ నమ:
  51. ఓం లంబజఠరాయ నమ:
  52. ఓం హ్రస్వగ్రీవాయ నమ:
  53. ఓం మహోదరాయ నమ:
  54. ఓం మదోత్కటాయ నమ:
  55. ఓం మహావీరాయ నమ:
  56. ఓం మంత్రిణ నమ:
  57. ఓం విష్ణుప్రియాయ నమ:
  58. ఓం భక్తజీవితాయనమ:
  59. ఓం జిత మన్మథాయ నమ:
  60. ఓం ఐశ్వర్య కారణాయ నమ:
  61. ఓం జయినే నమ:
  62. ఓం యక్షకిన్నర సేవితాయ నమ:
  63. ఓం గంగాసుతాయ నమ:
  64. ఓం గణాధీశాయ నమ:
  65. ఓం గంభీర నినదాయ నమ:
  66. ఓం వటవే నమ:
  67. ఓం అభీష్ట వరదాయనే నమ:
  68. ఓం జ్యోతిషే నమ:
  69. ఓం మణికింకిణీ మేఖలాయ నమ:
  70. ఓం సమస్త దేవతా మూర్తయే నమ:
  71. ఓం అక్షోభ్యాయ నమ:
  72. ఓం కుంజరాసుర భంజనాయ నమ:
  73. ఓం ప్రమోదాయ నమ:
  74. ఓం మోదక ప్రియాయ నమ:
  75. ఓం కాంతిమతే నమ:
  76. ఓం ధృతిమతే నమ:
  77. ఓం పుష్కరోక్షిప్త వారిణ నమ:
  78. ఓం అగ్రగణ్యాయ నమ:
  79. ఓం అగ్రపూజ్యాయ నమ:
  80. ఓం అగ్రగామినే నమ:
  81. ఓం భక్తనిధయే నమ:
  82. ఓం భావగమ్యాయ నమ:
  83. ఓం జిష్ణవే నమ:
  84. ఓం సహిష్ణవే నమ:
  85. ఓం సతతోత్థితాయ నమ:
  86. ఓం విఘాతకారిణ నమ:
  87. ఓం విశ్వదృశే నమ:
  88. ఓం విశ్వరక్షాకృతే నమ:
  89. ఓం కళ్యాణ గురవే నమ:
  90. ఓం ఉన్మత్తవేషాయ నమ:
  91. ఓం సర్వైశ్వర్య ప్రదాయకాయ నమ:
  92. ఓం అక్రాన్తచిదచిత్ప్రభవే నమ:
  93. ఓం కామినే నమ:
  94. ఓం కపిత్థపనస ప్రియాయ నమ:
  95. ఓం బ్రహ్మాచారిణ నమ:
  96. ఓం బ్రహ్మరూపిణ నమ:
  97. ఓం బ్రహ్మ విద్యాది దాన భువే నమ:
  98. ఓం మంగళ ప్రదాయ నమ:
  99. ఓం అవ్యక్తాయ నమ:
  100. ఓం అపాకృత పరాక్రమాయ నమ:
  101. ఓం సత్యధర్మిణ నమ:
  102. ఓం సఖ్యై నమ:
  103. ఓం సరసాంబునిధయే నమ:
  104. ఓం మహేశాయ నమ:
  105. ఓం దివ్యాంగాయ నమ:
  106. ఓం పరజితే నమ:
  107. ఓం సమస్త జగదాధారాయ నమ:
  108. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ:
  • ఓం అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
  • నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.

దూర్వాయుగ్మ పూజ (21 గరికపోచలతో ఈ క్రింది పది నామాలు చదువుతూ శ్రీ వరసిద్ధి వినాయకుని పూజించాలి.)

  • గణాధిపాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • ఉమాపుత్రా య నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • అఘనాశ నాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • వినాయకాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • ఈశపుత్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • సర్వసిద్ధి ప్రదాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • ఏకదంతాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • ఇభవక్త్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • మూషిక వాహనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • కుమారగురవే నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  • శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: దూర్వాయుగ్మ పూజాం సమర్పయామి.

ధూపం

(అగరవత్తులు వెలిగించి వినాయకునికి ధూపము చూపించాలి)

శ్లో|| వసస్పతుద్భవైర్దివ్యై:, నానాగంధై: సుసంయుత:

ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్‌.

దశాంగం గుగ్గలోపేతం సుగంధం సుమనోహరం,

ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ధూపమాఘ్రయామి.

దీపం

శ్లో|| సౌజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం

గృహాణం మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే.

శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమ: దీపం దర్శయామి.

ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

(నీరు పళ్ళెంలో వదలాలి)

నైవేద్యం

వినాయకుడికి ముందు అవసర నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయ చెక్కలు, అరటిపళ్లు, చలిమిడి, ఉండ్రాళ్లు, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు), ఇతర పళ్లు పళ్లెంలో పెట్టి ఆ పళ్లెముపై ”ఓమ్‌ భూర్భువస్సువ:! (పువ్వుతో పదార్థాలపై నీళ్ళు చల్లాలి) ఓం తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్యధీమహి! ధియోయోన: ప్రచోదయాత్‌!! (పదార్థాల చుట్టూ పువ్వుతో నీరు తిప్పాలి)

ఓమ్‌ సత్యంత్వర్తేన పరిషించామి!! (అని సూర్యోదయం తర్వాత చెప్పాలి)

ఓమ్‌ ఋతంత్వా సత్యేన పరిషించామి!! (అని సూర్యాస్తమయం తరువాత చెప్పాలి)

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ప్రీత్యర్థం అవసరార్థం నారికేళ, కదలీఫల, గుడపిష్ట (చలిమిడి), గుడోదక (పానకం), ముద్గ సూప (వడపప్పు), బహుబీజ ఫలం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, అంటూ గణనాధునికి నైవేద్యం సమర్పించాలి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి (అని నీళ్లు జల్లి ఒకసారి స్వామివారికి చూపించాలి) అమృతాపిధానమసి, ఉత్తరాపోశ నం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని (మూడుసార్లు కొంచెం కొం చెం నీరు పళ్లెంలో వదలాలి)

తాంబూలం

 తమలపాకులు చిల్లులు, వంకరలు లేనివి 2 వక్కలు తీసుకుని

శ్లో|| పూగీఫలై స్సకర్పూరై: నాగవల్లిd దళైర్యుతం,

మూక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: తాంబూలం సమర్ప యామి అంటూ వినాయకుని వద్ద ఉంచి నమస్కరించాలి.

నీరాజనం

(కర్పూరం వెలిగించి ఈ క్రింది విధముగా చదువుతూ గంట మోగించాలి)

శ్లో|| ఘృతవర్తి సహ్రసైశ్చ కర్పూర శక లైస్తథా

నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమ:

కర్పూర నీరాజనం సమర్పయామి.

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. (పళ్లెము లో నీరు వదలాలి)

మంత్రపుష్పం

(చేతిలో పువ్వులు, అక్షతలు, చిల్లర డబ్బులు తీసుకొని నమస్కరించి క్రింది విధముగా చదవాలి)

ధాతా పురస్తాద్యముదాజహార, శక్ర: ప్రవిద్వాన్‌ ప్రదిశశ్చతస్ర: తమేవం విద్వానమృత ఇహ భవతి,,నాన్య: పంధా అయనాయ విద్యతే ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం… విశ్వం నారాయణం దేవం అక్షరం పరం పదం…

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ:

వేదోక్త సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి అంటూ అక్షతలు పుష్పములు వినాయకుని పాదముల మీద ఉంచాలి.

ఆత్మప్రదక్షిణ

(అక్షతలు, పుష్పములు తీసుకుని కుడిచేతి మీదుగా తమ చుట్టూ తాము మూడుసార్లు తిరిగి ఈ క్రింది విధముగా చదవాలి)

శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ

తానితాని ప్రణశ్యంతు ప్రదక్షిణ పదేపదే

పాపోహంపాపకర్మాహం పాపాత్మా పాపసంభవ:

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక.

శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: సాష్టాంగ నమస్కారాన్‌ సమర్పయామి.

ఛత్రం ధారయామి చామరం వీజయామి సమస్త రాజోపచార, భక్త్యోపచార,

శక్త్యోపచార పూజాం సమర్పయామి. అని చదువుతూ

ఒక పువ్వుతూ వినాయకుడికి విసరి పువ్వును దేవునిపై వేయాలి.

శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||

అనయా ధ్యానావాహనాది షోడశోపచార జయాచ, భగవాన్‌ సర్వదే వాత్మక:

వరసిద్ధి వినాయక దేవతా సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.

అపరాధ క్షమాపణ

అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశంమయా

దాసోయ మితిమాం మత్వా క్షహస్వ వినాయక

ఆవాహనం నజానామి నజానామి విసర్జనం

పూజావిధిం నజానామి క్షమస్వ గణనాయక

శ్రీవరసిద్ధి వినాయకస్వామి ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా

దిగ్విజయమస్తు. అంటూ వినాయకుని పువ్వులు,

అక్షతలు తీసుకొని తలమీద వేసుకోవాలి.

వ్రతం సువ్రతమస్తు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా దిగ్విజయమస్తు.

ఉద్వాసన మంత్రం

(వినాయక ప్రతిమ ఉంచిన పీటను చేతితో పట్టుకొని క్రింది మంత్రం చదవాలి)

యజ్ఞేన యజ్ఞ మయజంతదేవా తాని ధర్మాణి ప్రధమాన్యాసన్‌ తేహనాకం

మహిమానస్యజన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా:

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: యధాస్థానముద్వాసయామి.

హరి: ఓం తత్సత్‌   బ్రహ్మార్పణమస్తు.

(ఇంతటితో వినాయకుని పూజావిధానము పూర్తి అయినది.)

Further Reading

Vaatapi Ganapathim Bhaje Song : https://youtu.be/BSq0islk3XY