విరామ చిహ్నములు (punctuation marks)

విరామ చిహ్నములు

విరామ చిహ్నములు

  • కామా (Camma) వాక్యాంశ బిందువు
  • సెమి కోలన్ – (Semi Colon) అర్ద బిందువు
  • కోలన్ (Colon) వ్యాస బిందువున్యూన దూర
  • బిందువు (Full Stop)
  • ప్రశ్నార్దక చిహ్నము (Question మార్క్)
  • ఆశ్చర్యార్ధక చిహ్నము (Note of exclamation)
  • కుండలన (Bracket)
  • ఉద్ధరణ చిహ్నము (Inverted Commas)
  • అవగ్రహము (Aposhophy)
  • లోప చిహ్నము (Ellipses)

1.కామా (Camma) వాక్యాంశ బిందువు (,)అసమాపక క్రియలకావలను, సముచ్చయాదులను, కొద్ది కాలమాప వలసి వచ్చు నపుడు ప్రయోగించవలెను.

ఉదా: ఆంజనేయుడు సముద్రమును దాటి, లంకను జేరెను. అశోకవనమున ప్రవేశించి, జానకిని జూచెను.

2.   సెమి కోలన్ – (Semi Colon) అర్ద బిందువు (;) వాక్య సముచ్చయములకు ముందు ప్రయోగింపబడును.

ఉదా:  శ్రీరాముడు సుగ్రీవునకభయ మిచ్చెను; అయిన అతడు నమ్మలేదు.

3.కోలన్ (Colon)-  వ్యాస బిందువున్యూన దూర (:) సంబంధము గల వాక్యముల చివర నీ గుర్తుండును. ఈ వ్యాస బిందువు ఒక అడ్డ గీతతోకూడి ఉదాహరణగా సూచించును.

ఉదా:- ఉత్పలమాల :- ఒక సమ వృత్తము

4.    (Full Stop) బిందువు (.)- వాక్యాంతమునను, నామైక దేశగ్రహణమునను దీనినుపయోగింతురు.

            ఉదా:- భగవంతుడే రక్షకుడు.

5. ప్రశ్నార్దక చిహ్నము Question Mark (?)ప్రశ్న వాక్యాంతమున నుండును.

ఉదా:- నీపేరేమి? వారెవరు?

6.ఆశ్చర్యార్ధక చిహ్నము (Note of exclamation) (!)ఆశ్చర్యార్ధక వాక్యాంతమునను, సంబోధనాంత వాక్యాంతమున నుపయోగింప బడును.

ఉదా:- ఆహో! ఓహో! రామా! కృష్ణా!

7.కుండలన (Bracket)ముందు పదమునకే () వివరణమయి, అనవసరమైనవాని నీ చిహ్నములో నుంతురు.

ఉదా:- ద్రుతము (నకారము) చివర గలవి. ద్రుతాంతములు.

8.ఉద్ధరణ చిహ్నము (Inverted Commas) (” “)-

ఉదా:- దశరధుడు “రామా ! నీ వరణ్యమునకు వెడలు” మనలేక విలపించి మూర్చిల్లె

9.అవగ్రహము (Aposhophy) (Z)- ధ్వనితోనేకీభవించి హ్రస్వ అకారము లోపించినపుడు ఇది ఉపయోగింపబడును.
ఉదా:- వయోz౦ బుద్ది; రమాzనుజుడు మొదలైనవి.

10.లోప చిహ్నము (Ellipses)చెప్పవలసిన (…) దానిలో కొంత లోపించిన దీని నుపయోగింతురు.

ఉదా:-“భాను సమాన…ఉత్పలమాల యైచనున్”