తెలుగు సామెతలు
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. “సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు” అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు. సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు (“ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు”). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు (“ఊరక రారు మహానుభావులు”). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును (“క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి”). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును (“ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి”, “కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే”). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును (“అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది”). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును (“మనసుంటే మార్గముంటుంది”) ప్రమాదమును హెచ్చరించవచ్చును (“చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి”). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును (“తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి”). హాస్యాన్ని పంచవచ్చును (“ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట”).
కొన్ని సామెతల జాబితా
- అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది.
- అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
- అందని పండ్లకు అర్రులు చాచినట్లు
- అందని ద్రాక్షలు పుల్లన
- అందితే సిగ అందకపోతే కాళ్ళు
- అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు
- అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు
- అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
- అంధుడికి అద్దం చూపించినట్లు
- అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
- ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
- ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
- ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు
- ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
- ఆకారం చూసి ఆశపడ్డానే కానీ… అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట…
- ఆకారపుష్టి నైవేద్యనష్టి
- ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
- ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
- ఆకులేని పంట అరవైఆరు పుట్లు…
- ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
- ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
- ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
- ఇంటికన్నా గుడి పదిలం
- ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
- ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
- ఇంట్లో పిల్లి వీధిలో పులి
- ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
- ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
- ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
- ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
- ఈ ఊరు ఆవూరికెంత దూరమో ఆవూరు ఈ వూరికి అంతే దూరం
- ఈ ఊపుడుక్కాదు ఆ ఊపుడుకు తట్టుకోవాలన్నాడట
- ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు – దాతలెవరంటే చాకళ్ళు
- ఈగ వ్రణం కోరు – నక్క పీనుగ కోరు
- ఈగను కప్ప మ్రింగితే – కప్పను పాము మ్రింగుతుంది
- ఈ చీరెట్లా వుందంటే, చీరే లేకుంటే నువ్వు మరీ బాగుంటావన్నాడట
- ఈ చేత చేస్తారు – ఆ చేత అనుభవిస్తారు
- ఈటె పోటు మానుతుంది గానీ మాట పోటు మానదు
- ఈడు చూసి పిల్లని యివ్వాలి – పిడి చూసి కొడవలి కొనాలి
- ఈడ్పు కాళ్ళు, ఈడ్పు చేతుల ఇతడేనమ్మా యిల్లరికపుటల్లుడు
- ఉంటే ఊరు – పోతే పాడు
- ఉంటే లిక్కి – పోతే కొడవలి
- ఉండనీయదు ఊరి శని ,తిననీయదు నోటి శని
- ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు
- ఉంటే అమీరు – లేకుంటే పకీరు
- ఉండ ఇల్లు లేదు – పండ మంచం లేదు
- ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట
- ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు
- ఉండి చూడు వూరి అందం – నానాటికీ చూడు నా అందం అన్నట్లు
- ఉండి చూడు వూరి అందం – నానాటికీ చూడు నా అందం అన్నట్లు
- ఊకని దంపితే బియ్యం వస్తాయా?
- ఊగే పంటి కింద రాయి పడ్డట్టు
- ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
- ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
- ఊపిరి వుంటే ఉప్పుగల్లు అమ్ముకొని బ్రతకవచ్చు
- ఊపిరి పట్టితే బొజ్జ నిండుతుందా?
- ఊరంతా ఉత్తరం వైపు చూస్తే అక్కుపక్షి దక్షిణం వైపు చూస్తుందిట
- ఊరంతా చుట్టాలే వుట్టి కట్టుకోను చోటు లేదు
- ఊరంతా తిరిగి యింటి ముందుకు వచ్చి పెళ్ళాంబిడ్డలను తలచుకుని కాళ్ళు విరగబడ్డాడుట
- ఊరంతా నాన్నకు లోకువ – నాన్న అమ్మకు లోకువ
- ఋణ శేషము శత్రు శేషము వుండ కూడ దంటారు.
- ఋణము – వ్రణము ఒక్కటే
- ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు
- ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదు
- ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
- ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
- ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు
- ఎంగిలికి ఎగ్గు లేదు – తాగుబోతుకు సిగ్గు లేదు
- ఎంచపోతే మంచమంతా కంతలే
- ఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు
- ఎంత నేర్చినా, ఎంత జూచినా,ఎంత వారలైనా కాంతా దాసులే
- ఎంత కరవొచ్చినా పులి గడ్డి మేయదు
- ఎంత ప్రొద్దుండగా లేచినా సందు చివరే తెల్లవారినట్లు
- ఎంత ప్రాప్తమో అంతే ఫలం
- ఏ అన్నమైతేనేం వరి అన్నమే పెట్టమన్నట్టు
- ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు
- ఏ ఎండకా గొడుగు పట్టినట్లు
- ఏ కర్రకు నిప్పంటుకుంటే ఆ కర్రే కాలుతుంది
- ఏకాదశి ఇంటికి శివరాత్రి వెళ్ళినట్లు
- ఏకాంతంలో కాంతా కలాపాలే ముద్దన్నట్లు
- ఏ కాలు జారినా పిర్రకే మోసం
- ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
- ఏకుతో తాకితే మేకుతో మొట్టినట్టు
- ఏకుతో తాకితే మోకుతో కొడతారు
- ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
- ఒకడి పాటు పది మంది సాపాటు అన్నట్టు
- ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
- ఒక దెబ్బకు రెండు పిట్టలు
- ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పే
- ఒల్లని మగడా వండి పెట్టరా అంటే చేతకాని పెళ్లామా చేర్చి పెట్టవే అన్నాడట
- ఒల్లని లంజకు విడువని మిండడు
- ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు
- ఒళ్ళు బలిసిన పూజారి అమ్మవారిని పట్టుకున్నాడట
- ఒంటికి ఓర్చలేనమ్మ రెంటికి ఓర్చునా
- ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
- ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
- ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
- ఓబీ ఓబీ నీవు వడ్లు దంచు నేను పక్కలెగురవేస్తా
- ఓర్చినమ్మకు తేటనీరు
- ఓలి సరసమని గిడ్డి దాన్ని పెళ్లాడితే కుండలన్ని ఒక్కలు కొట్టిందట
- కంచం అమ్మి మెట్టెలు కొన్నట్టు
- కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
- కంచం నిండా తిని, మంచానికి అడ్డంగా పడుకున్నట్లు
- కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
- కంచానికి ఒక్కడు – మంచానికి ఇద్దరు
- కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
- కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
- కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
- కంచే చేనుమేస్తే కాపేమి చేయగలడు?
- కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది
- క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
- క్షణం చిత్తం – క్షణం మాయ
- క్షణమొక యుగంలా గడిచింది
- క్షవర కళ్యాణంలాగా
- క్షామానికి జొన్న – వర్షానికి వరి పండుతాయి
- క్షేత్రమెరిగి విత్తనం వేయాలి
- క్షేమం కోరితే క్షామం లేదు
- క్షేమ సమాచారాలడిగినట్లు
- క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం వెయ్యాలి
- క్షేమంగా పోయి లాభంగా రండి
- గంగలో మునిగినా కాకి హంస కాదు
- గంగిగోవు పాలు గరిటడైన చాలు
- గంజాయి తోటలో తులసి మొక్క
- గజమూ మిధ్య – పలాయనమూ మిధ్య అన్నట్లు
- గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
- గంజిలోకి ఉప్పేలేకుంటే పాలలోకి పంచదారట
- గంత బొంత కలిపి గాడిద మోతంత అయినట్లు
- గట్టిగా ఆయుష్యముంటే గరిక నూరిపోసినా బ్రతుకుతాడు
- గట్టిగా తిడితే గాలిలో కలిసిపోతుంది – తనలో తిట్టుకుంటే తనకు తగుల్తుంది
- ఘడియ వెసులుబాటు లేదు దమ్మిడీ రాబడి లేదు
- ఘోటక బ్రహ్మచారి లాగా
- చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
- చంకలో పిల్లను వుంచుకుని సంతంతా వెతికినట్లు
- చంకెక్కిన పిల్ల చచ్చినా దిగదు
- చంద మామను చూసి కుక్కలు మొరిగినట్లు
- చందాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు
- చంద్రునికో నూలుపోగు
- చక్కదనానికి లొట్టిపిట్ట – సంగీతానికి గాడిద
- చక్కనమ్మ చిక్కినా అందమే
- చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
- చక్కని రాజమార్గం వుండగా గోడలు దూకట మెందుకు?
- జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల?
- జుట్టు అంటూ ఉంటే…………… ఏ జడైనా వేసుకొవచ్చు
- జగడమెట్లా వస్తుంది లింగయ్యా, అంటే?…………… బిచ్చం పెట్టవే బొచ్చు ముండా! అన్నాడట
- జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
- జరిగితే జల్లెడతో మోయవచ్చు
- జరిగితే జ్వరమంత సుఖం లేదు
- జరుగుబాటు తక్కువ – అదిరిపాటెక్కువ
- జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
- జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
- జాతి నాగులను చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్లు
- డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు
- డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
- డబ్బు దాచిన వాడికే తెలుసు – లెక్క వ్రాసిన వాడికే తెలుసు
- డబ్బుకుండే విలువ మానానికైనా లేదు
- డబ్బుకూ, ప్రాణానికీ లంకె
- డబ్బు కోసం గడ్డి తినే రకం
- డబ్బు ఉంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది
- డబ్బు మాట్లాడుతూంటే సత్యం మూగ పోతుంది
- డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు
- డబ్బురాని విద్య కూడు చేటు
- ఢిల్లీ రాజు కూతురైనా పెళ్ళి కొడుకుకు లోకువే
- ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
- తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది
- తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది – తల్లి చస్తే కాపురం తెలుస్తుంది
- తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
- తండ్రి వంకవారు దాయాదివారు
- తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
- తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
- తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
- తక్కువ వానికి నిక్కులు లావు
- తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
- తగిలించుకొనటం తేలిక – వదిలించుకోవటం కష్టం
- దండించేదాత లేకుంటే, తమ్ముడు చండప్రచండుడు
- దంపినమ్మకు బొక్కిందే దక్కుడు
- దంపుళ్ళ పాటకు దరిద్రం లేదు
- దగ్గరకు పిలిచి నీ కన్ను గుడ్డి అన్నట్లు
- దగ్గరకు వస్తే ఎగ్గు లెంచినట్లు
- దగ్గర వాళ్ళకే నిక్కు లెక్కువ
- దగ్గూ, గజ్జీ దాచినా దాగవు
- దగ్గుతూ పోతే సొంటి కూడ ప్రియమే
- దడియం గురువుకు మణుగు శిష్యుడు
- దత్తత మీద ప్రేమా? దాయాది మీద ప్రేమా?
- ధనమొస్తే దాచుకోవాలి రోగం వస్తే చెప్పుకోవాలి
- ధనం మూలం ఇదం జగత్
- ధనియాల జాతి వాళ్ళలాగా
- ధనియాల జాతి వాళ్ళలాగా
- ధర తక్కువ బంగారానికి వన్నెలెక్కువ
- ధరణికి గిరి భారమా?
- ధర్మానికి చీర యిస్తే, యింటికి వెనక్కి వెళ్ళి మూర వేసిందట
- ధర్మానికిపోతే కర్మం చుట్టుకొన్నట్లు
- ధూపం వేస్తే పాపం పోతుందా?
- ధీరుడైనా కావాలి దీనుడైనా కావాలి
- నక్క ఎక్కడ నాగలోక మెక్కడ?
- నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
- నక్క జిత్తులన్నీ నాదగ్గరుండగా తప్పించుకుపోయెరా తాబేటిబుఱ్ఱ
- నక్కను చూచిన వేటగాడిలాగా
- నక్కను త్రొక్కి వచ్చినట్లు
- నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదు – నేనింత ఉప్పెన ఎన్నడూ చూడలే దన్నదట
- నక్క పోయిన తర్వాత బొక్క కొట్టుకున్నట్లు
- నక్కలు బొక్కలు వెదుకును
- నక్క వినయం – కొంగ జపం
- నట్టేట చేయి విడిచినట్లు
- పంచాంగం పటపట – విస్తరాకు లొటలొట
- పంచాంగం పోగానే తిథీ వారాలూ పోతాయా?
- పంటకు పెంట – వంట మంట
- పండగ నాడు కూడా పాత మొగుడేనా?
- పండని ఏడు పాటు ఎక్కువ
- పండాకును చూచి పసరాకు నవ్వినట్లు
- పండాకు రాలుతుంటే పసరాకు నల్లబడుతుంది
- పండిత పుత్ర పరమ శుంఠ
- పండితపుత్రుడు… కానీ పండితుడే…
- పండిన రోజే పండుగ
- భంగు తాగేవారికి హంగుగాళ్ళు పదిమంది
- బందరు బడాయి గుంటూరు లడాయి
- బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా?
- బంధువుతో అయినా పాలి వ్యవసాయం చేయరాదు
- బంధువులకు దూరం – బావికి దగ్గర
- బంధువులంతా ఒక దిక్కు – బావమరిది ఇంకొక దిక్కు
- బంగారు పళ్లానికైనా గోడ వాలు కావలసిందె.
- బక్క ప్రాణం – కుక్క చావు
- బట్టతలకూ – మోకాళ్ళకూ ముడి వేసినట్లు
- బట్టతలమ్మకు పాపిట తీయమన్నట్లు
- భక్తి వచ్చినా, పగ వచ్చినా పట్టలేరు
- భయమైనా ఉండాలి – భక్తి అయినా ఉండాలి
- భరణి ఎండలకు బండలు – రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయి
- భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంట
- భరణిలో పుడితే ధరణిని ఏలు
- భర్త లోకం తన లోకం – కొడుకు లోకం పరలోకం
- భాగ్యముంటే బంగారం తింటారా?
- భాంచేత్ దేవుడికి మాదర్చేత్ పత్రి
- భాషకు తగిన వేషం – ఈడుకు తగిన ఆచారం
- భాషలు వేరైనా భావమొక్కటే
- మంగలిని చూసి గాడిద కుంటినట్లు
- మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినట్లు
- మంచాల తమకాలకు ఒయ్యారాల నజరానాలన్నట్లు
- మంగలి వాడి దృష్టి అందరి జుట్టుమీదే
- మంగలివాని యింటివెనుక దిబ్బ తవ్వినకొద్దీ వచ్చేది బొచ్చే
- మంచం మీద వున్నంతసేపే మగడు – కిందికి దిగితే యముడు
- మంచం వేసేంతవరకే ఇద్దరం – మంచం ఎక్కాక ఒక్కరవుదాం అందట
- మంచమంతా మదన రాజ్యమే నడచిరారా ఏలుకుందాం అందట
- మంచమెక్కిన తర్వాత విందు లేదన్నట్లు
- మంచమెక్కిన మీదట మర్యాదలేల?
- యతిమతం మొగుడికి ఎత్తుబారపు పెళ్ళాం
- యాదవకులంలో ముసలం పుట్టినట్లు
- యదార్థవాదీ లోక విరోధీ
- యథా పతీ తథా సతీ అన్నట్లు
- యారాలు చిన్నదైతే పాలు చిన్నదా? :
- యిష్టమైన పియ్య యింగువతో సమానం
- యెద్దు పుండు కాకికి ముద్దు
- యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు
- యేకులు పెడితే బుట్టలు చిరుగునా
- యోగికీ, రోగికీ, భోగికీ నిద్ర వుండదు
- రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా?
- రంకులాడికి నిష్ఠలు మెండు
- రంకు సాగితే పెళ్ళెందుకు?
- రచ్చకెక్కిన తర్వాత రాయబారమెందుకు?
- రతిలో సిగ్గు – రణములో భీతి కొరగావు
- రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు
- రత్నాలన్నీ ఒకచోట – రాళ్ళన్నీ మరొకచోట
- రవిక సవరిస్తూ కోకముడి విప్పినట్లు
- రసదెబ్బ తగలినిదే రంకు పుండు మానదు
- రహస్యం ఏమిటంటే, వడ్లగింజలోనిది బియ్యపుగింజ అన్నట్లు
- లంకలో పుట్టినవాళ్ళందరూ రాక్షసులే
- లంఖణానికి పెడితేగానీ పథ్యానికి రాదు
- లంచం లేనిదే మంచ మెక్కనన్నట్లు
- లంజకు నిక్కు – సంసారికి సిగ్గు
- లంజకు పిల్ల తగలాటము
- లంజకు పెట్టిన సొమ్మూ – గోడకు వేసిన సున్నం తిరిగి రావు
- లంజకు సిగ్గు తెగులు
- లంజ చెడి యిల్లాలయినట్లు
- లంజను లంజా అంటే రచ్చకెక్కుతుంది – ఇల్లాలిని లంజా అంటే యింట్లో దూరుతుంది
- లక్కవంటి తల్లి – రాయివంటి బిడ్డ
- వంకరో టింకరో వయసే చక్కన
- వంకాయలు కోస్తున్నారా ఇంత సేపు
- వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందట
- వంగలేక మంగళవారం అన్నాడంట
- వంట నేర్చిన మగవాడికి సూకరాలెక్కువ
- వంటిల్లు కుందేలు చొచ్చినట్లు
- వంటి మీద ఈగను కూడ వాలనీయను
- వండని అన్నం – వడకని బట్ట
- వండలేనమ్మకు వగపులు మెండు – తేలేనమ్మకు తిండి మెండు
- వండాలేదు, వార్చాలేదు – ముక్కున మసెక్కడిది అన్నట్లు
- శంఖులో పోస్తేగాని తీర్థం కాదని
- శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
- శతకోటి లింగాలలో బోడిలింగం
- శతకోటి లింగాల్లో నా బోడి లింగ మెక్కడ అన్నట్లు
- శతాపరాధములకు సహస్ర దండనలు
- శనగలుతిని చేయి కడుగుకొన్నట్లు
- శనిపడితే ఏడేళ్ళు – నేను పడితే పధ్నాలుగేళ్ళు
- శని విరగడయితే చాలు అన్నట్లు
- శనేశ్వరానికి నిద్రెక్కువ – దరిద్రానికి ఆకలెక్కువ
- శాపాలకు చచ్చినవాడూ దీవెనలకు బ్రతికినవాడూ లేడు
- షండునికి రంభ దొరికినట్లు
- షష్టినాడు చాకలివాడైనా ప్రయాణం చేయడు
- సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడట
- సంక్రాంతికి చంకలెత్తలేనంత చలి
- సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోనివారూ బయటకు వస్తారు
- సంఘ భయం – పాప భయం
- సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టు
- సంచిలాభం చిల్లు కూడదీసింది
- సంజయ రాయబారంలాగా
- సంతకు చీటి లచ్చికి గాజులు
- సంతకు వెళ్ళొచ్చిన ముఖంలాగా
- సంత మెరుగు సాని ఎరుగును
- హనుమంతుడి ముందా కుప్పిగంతులు
- హనుమంతుడు… అందగాడు…
- హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు
- హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు