ఆలోకయే శ్రీ బాలకృష్ణం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం

కన్నయ్య ని ఎంతమంది ఎన్ని రకాలుగా కొలిచారో కదా, విచిత్రంగా కన్నయ్య మీద ఎవరు పాట కానీ పద్యం కానీ, శ్లోకం కానీ ఏమి రాసినా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అది కన్నయ్య లీలే అంటా.

నారాయణ తీర్థులవారి ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఎంత హృద్యంగా ఉంటుందో, శ్రీమాన్ విశ్వనాధ్ గారు వారి శృతిలయలు చిత్రం కారణంగా చాలామందికి (కామన్ పీపుల్ ) ఈ పాట గురించి తెలిసిందనే చెప్పాలి. వాణీజయరాం గళంలో మరింత శ్రావ్యంగా ఉంటుంది ఈ మహదేవన్ గారి స్వరకల్పన.

విశ్వనాధ్ గారి వలన, వారి చిత్రాలవలన తెలుగు వారికి ఇల్లాంటి సంగీత నృత్య సంబందిత చిత్రాలని, పాటల్ని చూసే అవకాశం కలిగింది.

ఏలూరు వాస్తవ్యులు శ్రీమాన్ కొరడా సత్యనారాయణ గారి దగ్గర శిష్యరికం చేసిన షణ్ముఖ శ్రీనివాస్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారి.

చిత్రంలో వాడని 3 చరణాలని మీకోసం ఇక్కడ ఉంచడం జరిగింది, తప్పులుంటే పెద్దలు దిద్దగలరు.

మీకందరికీ మరోసారి కన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు.

ఈ పాట చూసి మీ పిల్లలని వెంటనే కన్నయ్యలుగా, రాధమ్మలా చేసెయ్యండి, భలేవుంటారు కదా,  నేను వెళ్ళాలి ఇంటికి మా బలరామ కృష్ణులని తయారుచేయాలి.

ఆలోకయే శ్రీ బాల కృష్ణం

సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ||ఆలోకయే||

చరణ నిక్వణిత నూపుర కృష్ణం

కర సంగత కనక కంకణ కృష్ణమ్

కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం

లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్

సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం

నంద నందనమ్ అఖండ విభూతి కృష్ణమ్

కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం

కలి కల్మష తిమిర భాస్కర కృష్ణమ్

నవనీత ఖంఠ దధి చోర కృష్ణం

భక్త భవ పాశ బంధ మోచన కృష్ణమ్

నీల మేఘ శ్యామ సుందర కృష్ణం

నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణమ్

వంశీ నాద వినోద సుందర కృష్ణం

పరమహంస కుల శంసిత చరిత కృష్ణమ్

గోవత్స బృంద పాలక కృష్ణం

కృత గోపికా చాల ఖేలన కృష్ణమ్

నంద సునందాది వందిత కృష్ణం

శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్

Scroll to Top