Author name: Admin

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగ కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ             సీతారామయ్య గారి మనవరాలు సినిమా  ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న చిన్న నవల ‘నవ్వినా కన్నీళ్లే’ నవల ఆధారంగా తీసింది. ఈ నవలికని స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట హరగోపాల్ తన భార్య మానస పేరును కలంపేరు చేసుకుని రాశారు. ఆయన వ్రాసిన నవలను సినిమా స్క్రిప్ట్‌గా […]

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ Read More »

ఆలోకయే శ్రీ బాలకృష్ణం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం కన్నయ్య ని ఎంతమంది ఎన్ని రకాలుగా కొలిచారో కదా, విచిత్రంగా కన్నయ్య మీద ఎవరు పాట కానీ పద్యం కానీ, శ్లోకం కానీ ఏమి రాసినా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అది కన్నయ్య లీలే అంటా. నారాయణ తీర్థులవారి ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఎంత హృద్యంగా ఉంటుందో, శ్రీమాన్ విశ్వనాధ్ గారు వారి శృతిలయలు చిత్రం కారణంగా చాలామందికి (కామన్ పీపుల్ ) ఈ పాట గురించి తెలిసిందనే చెప్పాలి. వాణీజయరాం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం Read More »

అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి…

అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి… సప్తపది, 1981లో విశ్వనాధ్ దర్శకత్వంలో  విడుదలైన  సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. ఒకమాదిరిగా విజయవంతమైంది.‘సప్తపది’ చిత్రంలో దుర్గాదేవి అష్టోత్తరం సన్నివేశానికి తగిన విధంగా చిత్రీకరించి ఆ సినిమాకు ఆ సన్నివేశమే ప్రాణంగా రూపొందించారు. పాటకు ముందుగానే కథానాయిక దుర్గాదేవిని అన్ని రూపాలలో కీర్తిస్తూ గానం చేసే ‘అఖిలాండేశ్వరి

అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి… Read More »

ఆదిభిక్షువు

ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు వాన బొట్టు ఆల్చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది.  అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రీ ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కుగా నడిపిస్తున్నారు.  ఆయన కలం అన్ని భావాలను అవలీలగా పలికిస్తుంది. సీతారామశాస్త్రీ గారి పాటల్లో జీవిత సత్యాలు

ఆదిభిక్షువు Read More »

ఆ.సు. కబుర్లు – తెలుగువారు భాషా దాన కర్ణులు

తెలుగువారు భాషా దాన కర్ణులు తెల్లవాణ్ని చూస్తే తెగ జాలేస్తుంది! తెలుగువాడే లేకపోతే వాడి గతి ఏముంది! శ్రుతి ఏముంది? ఫ్రెంచివాడు ఫ్రెంచి భాషలో దంచి కొడతాడు. చైనావాడు ఇంగ్లీషు ముక్క అవసరం లేకుండానే ప్రపంచాన్నయినా జయిస్తాడు. మన దేశంలోనూ తమిళుడు అరవం లేకుండా అరవడు. కన్నడిగుడు తన భాషనే, కన్నతల్లిగా భావించి కళ్లకద్దుకుంటాడు. కానీ తెలుగువాడో! ఆంగ్లాన్ని అందలం ఎక్కిస్తాడు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా బట్లర్‌ ఇంగ్లిష్‌లోనయినా ‘హిట్లర్‌’ అయిపోతాడు. ఇంగ్లిష్‌వాడు మనకేమన్నా చుట్టమా? అదీ లేదు.

ఆ.సు. కబుర్లు – తెలుగువారు భాషా దాన కర్ణులు Read More »

ఆ.సు. కబుర్లు – పుచ్ఛా వారి పుస్తక వైద్యం

పుచ్ఛా వారి పుస్తక వైద్యం నేను వృత్తిరీత్యా సైకియాట్రిస్టుని. రాష్ట్ర సైకియాట్రిస్టుల సంఘానికి అధ్యక్షుడు సతీష్ బాబు నాకు మంచి స్నేహితుడు. ఇవ్వాళ ఉదయాన్నే సతీష్ దగ్గర్నుండి ఫోన్.  “హలో బ్రదర్! తెనాలిలో ఎవరో సైకియాట్రిస్ట్‌నని చెప్పుకుంటూ పేషంట్లని ట్రీట్ చేస్తున్నాట్ట. నాకా వివరాలు కావాలి. నువ్వా సంగతేంటో కనుక్కో.”  “చూడు బ్రదర్! మనవాళ్ళ ఫీజుల బాదుణ్ని పేషంట్లు తట్టుకోలేకపోతున్నారు. అంచేత వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు, మనకెందుకులేద్దూ.” బద్దకంగా అన్నాను.  “డిగ్రీ లేకుండా వైద్యం చెయ్యడం

ఆ.సు. కబుర్లు – పుచ్ఛా వారి పుస్తక వైద్యం Read More »

ఆ.సు. కబుర్లు – ‘కరోనా’ ను భయపెట్టిన ప్రతిబోధ భట్టు ప్రవచనం

‘కరోనా’ ను భయపెట్టిన ప్రతిబోధ భట్టు ప్రవచనం గొప్పలు చెప్పుకోవడం, ఎవరి అనుభవాలనో విని వాటిని తమవిగా వర్తింపచేసుకుని చెప్పుకోవడం, ఎవరో వ్రాసినదాన్ని కాపీ చేసి తమవిగా చెప్పుకోవడం … ఇలాంటి లక్షణాలుండే వ్యక్తులు మనకు తరచూ తగుల్తూనే ఉంటారు. ఒప్పుకోడానికి మనసొప్పదు గానీ మనలోనూ ఆ లక్షణాలు నిండు కుండలా ఉంటాయి. అయితే ఇలాంటి లక్షణాలన్నింటికీ పరాకాష్ఠ, ఎవరెస్ట్ శిఖరం అనదగ్గ కేరెక్టర్ మన ‘ప్రతిబోధ భట్టు’.  మన ‘ప్రతిబోధ భట్టు’ గారు కాలాతీత, భాషాతీత,

ఆ.సు. కబుర్లు – ‘కరోనా’ ను భయపెట్టిన ప్రతిబోధ భట్టు ప్రవచనం Read More »

ఆ.సు. కబుర్లు – జీవన్ముక్తుడు

జీవన్ముక్తుడు ఏడుకొండలవాడా! ఆపదమొక్కులవాడా గోవిందా గోవిందా! ఇలా భగవంతుడికి మొక్కుకొని తమ కోరికలు తీరాయని తమను ఆపదలనుంచి గట్టెక్కిచ్చాడని భగవంతుడికి మొక్కులు తీర్చుకోవటం పరిపాటి.  అసలు నిజంగా భగవంతుడికి ఇలా మనం కోరిన కోరికలు తీర్చే శక్తి ఉందా? ఓ కథతో కూడిన విశ్లేషణ …. సరదా గానూ సీరియస్ గానూ… నాపేరు వినాయకరావు. వినాయకుడి భక్తుణ్ణి. ఉద్యోగం వస్తే భగవంతుడికి నిలువుదోపిడి   ఇస్తానని మొక్కుకొని సమయానికి రైలు అందక ఇంటర్వ్యూ కి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకున్నాను. 

ఆ.సు. కబుర్లు – జీవన్ముక్తుడు Read More »

ఆ.సు. కబుర్లు – హాస్యం

హాస్యం మనసారా థియేటర్‌లో నవ్వుకొని కొనే్నళ్లయింది. సినిమా పుట్టి కొన్ని దశాబ్దాలు గడిచింత్తర్వాత.. ‘జంధ్యాల’ తన అక్షర విరుపుతో కలాన్ని ఝళిపించాడు. ఆ మెరుపులూ తళుకులూ సెల్యులాయిడ్‌పై సరిగ్గా మెరవక ముందే ‘అక్షరాల్ని’ మూటగట్టుకొని తన జీవితానికి ‘శుభం’ కార్డు వేసేసుకున్నాడు. సినీ చరిత్రలో ‘జంధ్యాల’ హాస్యానికి పూర్వం.. తర్వాత అన్నట్టు ‘కామెడీ’ని సృష్టించి మరపురాని పాత్రల్ని మదిలో వేశాడు.ఇక్కడ జంధ్యాలని స్మరించుకోవటం కాదు. మరచిపోయిన హాస్యానికి సంస్మరణ. ఆ సందర్భంగా కొన్ని జంధ్యాల మాటలు. ఆయన

ఆ.సు. కబుర్లు – హాస్యం Read More »

ఆ.సు. కబుర్లు : ఇదెక్కడి చోద్యం?

ఇదెక్కడి చోద్యం?. మధ్యాహ్నం మృష్టాన్న భోజనం చేసి బ్రేవ్ మని త్రేన్చుతూ కూర్చున్నారు జంఘాల శాస్త్రి గారు. భార్య గేనపెసూనాంబగారు ఇంకా వంటిట్లో పని చేస్తున్నారు.  జంఘాల శాస్త్రి గారు ఆలస్యం తట్టుకోలేక ఒసేయ్ ‘భోజనానంతరం తాంబూల చర్వణం అన్నారు’ విపిస్తున్నాదా కాలభైరవ పట్టి అని అరిచేడు.  ఆవిడ లోపలినుంచి వస్తున్నానండి అని తాంబూలానికి తమలపాకులు, సున్నం, వక్కలు  వగైరా పట్టుకుని వచ్చి ఇంకా మెయ్యండి  వానర పుత్ర అని అందించింది. నెమ్మదిగా   వాళ్ళు మాటల్లో పడ్డారు. 

ఆ.సు. కబుర్లు : ఇదెక్కడి చోద్యం? Read More »