Aasu Kaburlu

Aasu Kaburlu Telugu funny talks and stories

ఆ.సు. కబుర్లు : అప్పు మంచిదే

ఆంద్ర రాష్ట్రంలో అత్యధికంగా ప్రజాదరణ కలిగిన ‘అగ్నిహోత్రం’ దిన, వార పత్రికలకు ఎడిటర్ మన ‘భావావేశం’. ఈయన గారు ‘గిరీశం’ వీరాభిమాని. గురజాడ గారు ఎంత బూస్ట్ అప్ చేసినా ‘గిరీశం’ కి రావలసినంత ఆదరణ రాలేదని మన ‘భావావేశం’ గారి అభి ప్రాయం. ‘నాతో మాట్లాడ్డమే ఒక ఎడ్యుకేషన్’ అన్న గిరీశం సూక్తిని బాగా ఒంటపట్టించుకుని తాను కూడా గిరీశం అంతటివాడేనన్నఅభిప్రాయంతో బతికేస్తున్న స్వాభిమాన జీవి. ఇంకొక విషయం ఏమిటంటే మన భావావేశంకి తెలుగు భాషాభిమానం ఎక్కువే. అలాగే తెలుగు ప్రజలపైన అచంచల విశ్వాసం, గౌరవం కూడా. ‘తెలుగు వారికి తెలుగువారే సాటి’ అని వేరేవారు తెలుగువారికి సాటి రాలేరని బాగా నొక్కి వక్కాణించి చెప్పేడు.

ఆ.సు. కబుర్లు : అప్పు మంచిదే Read More »

ఆ.సు. కబుర్లు : ప్రారబ్ధం

తెలుగువాడికి సాటి తెలుగు వాడే. అందరూ ఒక దారిలో వెళితే తెలుగువాడు ఆ దారిలో వెళ్ళడు. అందరూ పొగ పీలిస్తే తెలుగువాడు పొగ తాగుతాడు. ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. సంస్కృతాన్ని అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా ‘సచ్చినోడా’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు. చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? తెలుగువాడు కంటిచూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది.

ఆ.సు. కబుర్లు : ప్రారబ్ధం Read More »

ఆ.సు. కబుర్లు : పుచ్చిన జ్ఞానదంతం

ఒక రోజు మధ్యాహ్నం వీధిలో ఇళ్ళదగ్గర పారేసిన ఆకులు, కాయలు వగైరా తింటూ ఆవు కనిపించింది అంతే ఎప్పుడు దాని పాలు తాగుదామా అని చూస్తున్న నాకు నా ఆలోచన అమలు చేయాలనిపించింది. వీధిలో ఎవరూ కనపడలేదు సరే నా టైము బాగుందని మెల్లగా ఆవు పొడుగు దగ్గర కూర్చుని నెమ్మదిగా దాని శిరాలు అందుకోవాలని ప్రయత్నం చేసేను ముందు అందలేదు కానీ తీరా అంది నేను నోట్లో పెట్టుకున్నానో లేదో ఫెడీమని వెనక కాలుతో ఓ తన్ను తన్ని ముందుకు వెళ్ళిపోయింది. నేను క్రింద పడి పన్నూడి నోట్లోంచి రక్తం వస్తుండగా ఇంట్లోకి వెళ్లిపోయెను.

ఆ.సు. కబుర్లు : పుచ్చిన జ్ఞానదంతం Read More »

ఆ.సు. కబుర్లు : కుక్కల పంచాయితీ

నేనుంటున్నది హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతం. మా కాలనీలో విద్యార్ధులకేమి లోటులేదు. L.K.G నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న వాళ్ళున్నారు. మా కాలనీలో కుక్కలు కూడా ఎక్కువే. మాతో సమాన సంఖ్య కాకపోయినా ఏ రోజుకైనా మాతో సమానమవుతామన్న ధీమాతో ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు విషయమేమిటంటే హైదరాబాద్ లోని అన్ని కాలనీల్లాగే మా కాలనీలో కూడా అన్నీ అపార్టుమెంట్లే.

ఆ.సు. కబుర్లు : కుక్కల పంచాయితీ Read More »

ఆ.సు. కబుర్లు : మార్గదర్శి

అండ, పిండ, బ్రహ్మాండాలని అర్ధం చేసుకోగలిగినంత చదువు చదవాలని పరబ్రహ్మ పరివ్రాజకాచారి కోరిక. అందుకోసం గొప్ప పాండిత్యం కల కర్కశ నిష్కర్ష సోమయాజి గారిని ఆశ్రయించేడు. గురువు గారితో తన మనసులోని కోరికచేప్పి తనని సకల శాస్త్రపారంగతుడిగా చెయ్యమని కోరేడు. సోమయాజి గారికి అతిశయమెక్కువ. అండ, పిండ, బ్రహ్మాండాలని అర్ధం చేసుకోవడం ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నావా మాకు విద్య నేర్పిన గురువుకే అది సాధ్యపడలేదు అని సోమయాజులు గారు తెలియచేసేరు. వెంటనే మన పరివ్రాజకాచారికి సందేహం వచ్చింది.

ఆ.సు. కబుర్లు : మార్గదర్శి Read More »

ఆ.సు. కబుర్లు : జంఘాల శాస్త్రి – జాగిలం

మాది తూ.గో.జిల్లా కోనసీమ ప్రాంతం. మాదొక లంక గ్రామం. మా గ్రామం పేరు అప్రదిష్ట లంక. నాపేరు అధోముఖం. కాస్తో కూస్తో వేదం చదివేను కానీ మా గ్రామస్థులు, చుట్టుప్రక్కల గ్రామస్థులు కూడా నేను తద్దినం బ్రాహ్మణార్తానికి తప్ప ఇంకెందుకు పనికిరానని నిర్ణయించి నన్ను తద్దినం బ్రాహ్మణార్తానికి తప్ప మరి దేనికి పిలవరు. మా గ్రామంలో ఏ కార్యానికైనా పిలిచే ఒకే ఒక్క వ్యక్తి జంఘాల శాస్త్రి.

ఆ.సు. కబుర్లు : జంఘాల శాస్త్రి – జాగిలం Read More »