Telugu Cinema Songs Analysis

Telugu Cinema Songs Analysis సినిమా పాటల సాహిత్యంపై విశ్లేషణ

చందమామ… అందాల మామా!

చందమామ… అందాల మామా! ‘మంచి మనసులు’, ‘మూగమనసులు’వంటి అమోఘ విజయం సాధించిన చిత్రాల తరువాత బాబూమూవీస్ వారు అందరూ కొత్త నటులతో ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో రంగుల్లో నిర్మించబడ్డ మూడవ చిత్రం 1965లో విడుదలైన ‘తేనె మనసులు’. ఒక అమ్మాయికి పెళ్ళిచూపులు జరిగితే, ఏ పక్కింటి అమ్మాయో వచ్చి ఎలా జరిగింది పెళ్ళిచూపుల తతంగం? అని అడిగితే సిగ్గుపడుతూ, కాబోయే ఆ పెళ్లికూతురు చెప్పే సమాధానామే ఈ పాట.  కాకపోతే పక్కింటి అమ్మాయికి బదులు చల్లని […]

చందమామ… అందాల మామా! Read More »

నడిరేయి ఏ జాములో

నడిరేయి ఏ జాములో “అనుకున్నవన్నీ జరగాలంటే అమ్మవారిని నమ్ముకోవాలి” అన్నది తెలుగు సామెత. అయ్యగారు అధికారహోదాలో ఉండి కొరకరాని కొయ్యగా ప్రవర్తించే మనిషి అయితే ఆయన ద్వారా ఏమైనా పనులు జరిపించుకోవాలంటే అమ్మగారిని అదేనండి సదరు అధికారి గారిభార్య గారిని జాగ్రత్తగా కాకాపట్టి మంచి చేసుకుంటే ఎంత క్లిష్టమైన పనయినా జరిగి పోతుంది.  ఇదే కదా మన సామెతకి అర్ధం.  బహుశా పురాణం కాలం నాటి వారు కూడా ఇందుకేమి మినహాయింపు కాదేమో!  అసలు వారు కూడా

నడిరేయి ఏ జాములో Read More »

నాద వినోదము

నాద వినోదము వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయేజగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!వందే పార్వతీప రమేశ్వరౌ నాద వినోదము నాట్య విలాసముపరమ సుఖము పరముఅభినయ వేదము సభకనువాదముసలుపు పరమ పదమూభావములో ఆ.. భంగిమలో ఆ..గానములో ఆ.. గమకములో ఆ…భావములో భంగిమలోగానములో గమకములోఆంగికమౌ తపమీ గతి సేయగ నాదవినోదము నాట్యవిలాసముపరమ సుఖము పరముఅభినయ వేదము సభకనువాదముసలుపు పరమ పదమూఆ..ఆ..ఆ………  ని ని మ ద ని ని.. ని.. మ ద ని స ని.. ని..  రి స ని ద ని.. ని   మ గ మ

నాద వినోదము Read More »

లలిత భావ నిలయ

లలిత భావ నిలయ 1967 లో విడుదలైన సంగీత, సాహిత్యాల అపురూప సమ్మేళనం అని చెప్పుకోదగ్గ సినిమా  ‘రహస్యం’. ఈ సినిమాలో నాగేశ్వర రావు, ఎస్. వి. రంగా రావు, కృష్ణ కుమారి, బి. సరోజా దేవి నటించారు. సంగీతము అందించినది ఘంటసాల గారు. సాహిత్యం మల్లాది రామకృష్ణ శాస్త్రి. జగన్మాత లలితాదేవి నిలయంలో అమ్మవారి వైభవాన్ని లక్ష్మి, పార్వతి, సరస్వతులు కలిసి వర్ణిస్తూ, నారదుడు, ఇతర దివ్యాంగనామణులతో కలిసి స్తుతించే సన్నివేశానికి రాసిన పాట ‘లలిత

లలిత భావ నిలయ Read More »

కిరాతార్జునీయం – భక్త కన్నప్ప

కిరాతార్జునీయం – భక్త కన్నప్ప జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల తకిట తకతక తకిట చరిత పదయుగళ – మొదలైంది. పాట. మూలంలోని పద్యంలో ఏది ముట్టుకోవాలో దేన్ని వదులుకోవాలో వేటూరి కనుచూపు కొసలకు పెనుపాళి కొసలకు తెలిసిన విద్వత్‌తో శంకరుడు ఎరుకలవానిగా మారుతున్నాడు. వేటూరి పెనుచూపు శంకరుని తలను ఒక్కసారే నిశితంగా గుర్తు తెచ్చుకుంది. ‘తలపై నెలవంక’ను శ్రీనాథుని ‘వికట పాటల జటా మకుటికాభారంబు కరుకైన జుంజురునెరులు కాగ –

కిరాతార్జునీయం – భక్త కన్నప్ప Read More »

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి మీద కూనిరాగమే పెద్ద అవార్డు అంటారు సిరివెన్నెల.   ‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’ అని ‘చక్రం’ సినిమాలో రాశారాయన. ‘ఆయువనేది ఉండేవరకూ ఇంకేదో లేదని అనకు’ అనే జీవిత సారాన్ని చాలా

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా Read More »

గిరిజా కళ్యాణం

సంగీత సాహిత్య అవలోకనం – గిరిజా కళ్యాణం లలితా శివజ్యోతి  పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఏ. శంకరరెడ్డి నిర్మించిన చిత్రం ‘రహస్యం’. ఈ సినిమాలోని పాటలు సాహిత్య పరంగా సంగీతపరంగా ప్రజాదరణ పొందాయి. కూచిపూడి భాగవతుల నృత్య రూపకం ‘గిరిజా కళ్యాణం’.  మల్లాది రామకృష్ణశాస్త్రి సినీ జీవన ప్రస్థానంలో సాహిత్యపరంగా వన్నెతెచ్చిన చిత్రం లలితా శివజ్యోతి వారి ‘రహస్యం’ సినిమా. ఈ సినిమా కోసం మల్లాది గిరిజా కల్యాణం యక్షగానాన్ని ఒక సంగీత జలపాతంలా మలిచారు.

గిరిజా కళ్యాణం Read More »

గాలికి కులమేది? ఏదీ నేలకు కులమేది

గాలికి కులమేది?  ఏదీ నేలకు కులమేది తెలుగు చలన చిత్ర సినీ సంగీతానికి 1960 నుంచి 1980 వరకు స్వర్ణయుగమనే చెప్పాలి. భావరంజితమైన గీత సాహిత్యం ఆ రోజుల్లో సినిమా కళను మరింత తీర్చిదిద్దింది. మధుర గాయనీ గాయకులు, సుమధుర సంగీత దర్శకులు, సుసంపన్న సాహిత్యాన్ని సృష్టించిన గీత రచయితలు… ఎన్నో భావరంజిత గీతాలను అందించిన ఆనాటి సినిమా లోకానికి సినారె ఒక పెద్ద సంపద. మట్టిలో, గాలిలో ఆయన పాట పెనవేసుకుపోయింది. ఆనాటి గాయకుల మధుర

గాలికి కులమేది? ఏదీ నేలకు కులమేది Read More »

చికిలింత చిగురు

అక్షర మర్మయోగి అద్భుత ప్రయోగం ‘చికిలింత చిగురు’ లైలా మజ్ను, దేవదాసు, అనార్కలి వంటి విషాదాంత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. దానికి కారణం అవి బాగా ప్రాచుర్యం ఉన్న కథలు కావడమే. అయితే మున్నెన్నడూ వినని, చూడని కథను సినిమాగా మలిచి దానిని విషాదాంతం చేసి విజయం సాధించడమనేది చిన్న విషయం కాదు. అటువంటి సినిమాలు నిర్మించేందుకు గుండె ధైర్యం కావాలి. అలాంటిదే డి.ఎల్‌గా పేరొందిన ద్రోణావజ్ఝుల లక్ష్మీనారాయణ ‘దేవదాసు’ సినిమా తరువాత నిర్మించిన ‘చిరంజీవులు’

చికిలింత చిగురు Read More »

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగ కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ             సీతారామయ్య గారి మనవరాలు సినిమా  ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న చిన్న నవల ‘నవ్వినా కన్నీళ్లే’ నవల ఆధారంగా తీసింది. ఈ నవలికని స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట హరగోపాల్ తన భార్య మానస పేరును కలంపేరు చేసుకుని రాశారు. ఆయన వ్రాసిన నవలను సినిమా స్క్రిప్ట్‌గా

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ Read More »