అక్షర శ్రేణి – Letter Series

అక్షర శ్రేణి పై పట్టు సాధించాలంటే పాటించవలసిన జాగ్రత్తలు

1. A నుంచి Z వరకు అలాగే  Z నుంచి  A వరకు వేగంగా చదవగలగాలి.

2. A నుంచి Z వరకు వాటి స్ధానవిలువలు (A-1, B-2, C-3…. X-24, Y-25, Z-26)  తెలిసి ఉండాలి. 

3. Z నుంచి A వరకు వెనుకనుంచి ముందుకు  వాటి స్ధానవిలువలు (Z-1, Y-2, X-3 …. C-24, B-25, A-26)  తెలిసి ఉండాలి.

4. A నుంచి Z వరకు రివర్స్ పొజిషన్ లెటర్స్ (అంటే A కు Z   B కు Y  C కు X ) తెలిసి ఉండాలి.

5. పై వాటితో పాటుగా నంబర్ సిరీస్ పై సంపూర్ణ అవగాహన ఉండాలి.

6. పై విషయాలను చక్కగా సాధన చేస్తే లెటర్ సిరీస్ త్వరగా నేర్చుకుని చేయ గలుగుతాం.

ఇప్పుడు A నుంచి Z వరకు స్ధానవిలువలను పరిశీలిద్దాం. ఈ స్ధానవిలువలను బట్టీపట్టడం వలన పెద్ద ప్రయోజనమేమి ఉండదు. త్వరగా మరిచిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా కింద ఇచ్చిన పదాన్ని దాని స్ధానవిలువలను గుర్తుంచుకుంటే అందువలన వీటి తర్వాతి అక్షరాల స్ధానవిలువలను వీటి ఆధారంగా గుర్తుంచుకోవచ్చు. మిగిలిన అక్షరాలను కూడా ఎవరికి వారు తమకు గుర్తుండే రీతిలో స్వంతంగా కోడ్ లు తయారుచేసుకుంటే అవి చాలా సులువుగా గుర్తుంటాయి.

A        E        J        O        T        Y

1        5       10       15      20      25

ఉదాహరణకు బృందావన కాలనీ 7/G అనే సినిమా పేరు గుర్తుంచుకుంటే G స్థానవిలువ  7 అని గుర్తుంటుంది.  అలాగే క్రికెట్ లో బాగా పాపులర్ అయిన T-20    ఆటను గుర్తుంచుకుంటే T  స్థానవిలువ 20  అని గుర్తుంటుంది. ఇలాగే మిగిలిన అక్షరాలకు కూడా స్వంతంగా కోడ్ లు గుర్తుంచుకునే విధంగా సాధన చేస్తే మంచిది. 

రివర్స్ ఆర్డర్ లో Z  నుంచి A వరకు స్థానవిలువలు గుర్తుంచుకోవాలంటే, అందుకోసం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు.  ఒక సులువైన చిట్కా ద్వారా వీటిని గుర్తుంచుకోవచ్చు. కానీ ముందుగా మనకి A నుంచి Z వరకు స్థానవిలువలు తెలిసుండాలి.  ఏదైనా అక్షరం స్థానవిలువ రివర్స్ ఆర్డర్ లో కావాలంటే 27 నుంచి మనకు  కావలసిన అక్షరం స్థానవిలువని  తీసివేయాలి.

ఉదాహరణకు రివర్స్ ఆర్డర్ లో L స్థానవిలువ కావాలంటే  27నుంచి L స్థానవిలువను తీసివేయాలి. L

స్థానవిలువ 12 కాబట్టి పైన చెప్పిన ప్రకారం రివర్స్ ఆర్డర్ లో L స్థానవిలువ కావాలంటే 27 – 12 = 15 రివర్స్ ఆర్డర్ లో L స్థానవిలువ = 15

ఇప్పుడు రివర్స్ ఆర్డర్ లో Q స్థానవిలువ కనుక్కోండి. 

Q స్థానవిలువ = 17

పైన చెప్పిన ప్రకారం రివర్స్ ఆర్డర్ లో Q స్థానవిలువ కావాలంటే 27 – 17 = 10

రివర్స్ ఆర్డర్ లో Q స్థానవిలువ = 10

ఇప్పుడు రివర్స్ ఆర్డర్ లో T స్థానవిలువ కనుక్కోండి

T స్థానవిలువ = 20

పైన చెప్పిన ప్రకారం రివర్స్ ఆర్డర్ లో T స్థానవిలువ కావాలంటే 27 – 20 = 7

రివర్స్ ఆర్డర్ లో T స్థానవిలువ = 7

అలాగే ఇప్పటి వరకు పైన నేర్చుకున్నవాటితోపాటుగా అక్షరాల రివర్స్ పొజిషన్ లెటర్స్ తెలిసి ఉండాలి.  ఈ పద్ధతికి ముందుగా అక్షరముయొక్క రివర్స్ పొజిషన్ నంబర్ తెలుసుకొని, ఆ స్థానవిలువ కలిగిన అక్షరాన్ని కనుక్కోవాలి.  ఇదే ఆ అక్షరముయొక్క  రివర్స్ పొజిషన్ లెటర్ అవుతుంది. 

ఉదాహరణకు R రివర్స్ పొజిషన్ లెటర్ కావాలంటే ముందుగా R స్థానవిలువ తెలుసుకోవాలి.

R స్థానవిలువ = 18  ఇప్పుడు ముందు చెప్పిన ప్రకారంగా 27  నుంచి R స్థానవిలువ తీసివేయాలి. ఆ వచ్చిన సంఖ్య ఏదయితే ఆ అక్షరం రివర్స్ పొజిషన్ లెటర్ అవుతుంది. 

27 – 18 = 9  స్థానవిలువ ప్రకారం 9 వ అక్షరం I  కాబట్టి R రివర్స్ పొజిషన్ లెటర్ I అవుతుంది.    

R రివర్స్ పొజిషన్ లెటర్ I అయితే I రివర్స్ పొజిషన్ లెటర్ R అవుతుంది.

I స్థానవిలువ = 9;  27 – 9 = 18   స్థానవిలువ ప్రకారం 18 వ అక్షరం R కాబట్టి I రివర్స్ పొజిషన్ లెటర్ R అవుతుంది.   

ఈ లెటర్ సిరీస్ లో అక్షరాల మధ్య వ్యత్యాసం స్వల్పంగా ఉంటే సమాధానం సులువుగా డైరక్టుగా గుర్తించవచ్చు.  కానీ అక్షరాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అక్షరాల స్థానవిలువలు రాసుకోవాలి. అప్పుడు అది ఒక నంబర్ సిరీస్ అవుతుంది.  దాని  ఆధారంగా చివర వచ్చే నంబర్ కనుక్కొని దాని స్థానవిలువను బట్టి కావాల్సిన అక్షరాన్ని కనుక్కోవాలి. 

ఉదాహరణలు

1) N, P, R, T, V ——-

పై సిరీస్ లో ప్రతి అక్షరం తర్వాత ఒక అక్షరం మినహాయిస్తూ తర్వాత అక్షరాలు ఉన్నాయి.  ‘N’ తర్వాత ‘O’ మినహాయించి ‘P’  వస్తుంది. అదే విధంగా ‘V’ తర్వాత  ‘W’ మినహాయించి ‘X’  రావాలి.

؞ సమాధానం: X

2) A, E, I, —- U

పై సిరీస్ లో ఇంగ్లీష్ భాషలోని అచ్చులు వరుసగా ఉన్నాయి. ఆ ప్రకారంగా మధ్యనున్న ఖాళీలో ‘O’   రావాలి. 

؞ సమాధానం: O

3) W, V, T, S, Q, P, N, M —–,  —–

a) I, J  b)  J,I  c) J, K d) K, J

ఈ సిరీస్ లో అక్షరాలను వాటి స్థానవిలువల ప్రకారంగా చూస్తే వాటి స్థానవిలువలు క్రమంగా 23, 22, 20,  19, 17, 16,  14, 13 —–,  —–  అనే నంబర్ సిరీస్ ఏర్పడింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఈ సిరీస్ 1, 2  1,2 …..  చొప్పున క్రమంగా తగ్గుతోంది. చివరిసారిగా 14  నుంచి 13 కు 1 తగ్గింది. ఆ తర్వాత 2,1  లు తగ్గాలి.

؞ 13-2 = 11

   11-1 = 10

؞ 11 వ అక్షరం K; 10 వ అక్షరం J

؞ సమాధానం: c)  K, J

4) Z, X, V, T, R, —–,  —–

a) O, K      b) N, M    c) P, N    d) M, N

పై సిరీస్ లో అక్షరాలు రివర్స్ ఆర్డర్ లో ఒకటి వదిలి మరొకటి వచ్చాయి. కాబట్టి తర్వాత P, N లు రావాలి.

؞ సమాధానం: c) P, N

5) AZ, CX, FU  —–

a) JQ     b) KP    c) JR    d) IV

ఈ సిరీస్ లో అక్షరాలను వాటి స్థానవిలువల ప్రకారంగా చూస్తే వాటి స్థానవిలువలు క్రమంగా 1, 26,  3, 24,    6, 21   —–

ఇందులో మొదటి సంఖ్య లో 1, 3, 6, —– లు  వరుసగా 2, 3 చొప్పున పెరిగాయి.  తర్వాత 4 పెరగాలి. అంటే 6 + 4 = 10 రావాలి.

రెండో సంఖ్య లో 26, 24, 21 లు వరుసగా 2, 3 ల చొప్పున తగ్గాయి. తర్వాత 4 తగ్గాలి. అంటే 21 – 4 = 17 రావాలి.

అంటే ఖాళీలలో వరుసగా 10 వ, 17 వ అక్షరాలైన J,Q  లు రావాలి.

؞ సమాధానం: a) JQ

6) POQ,  SRT,  VUW  —–

a) XYZ     b) XZY     c) YXZ     d) YZX

పై సిరీస్ లో ప్రతి సమూహంలో మూడు అక్షరాలున్నాయి. వాటిని వాటియొక్క స్థానవిలువల ప్రకారంగా నంబర్లలోనికి మారిస్తే 16, 15, 17    19, 18, 20   22, 21, 23.

ఇప్పుడు పై నంబర్ సిరీస్ ప్రకారం మూడు గ్రూపుల్లోని మొదటి సంఖ్య 3 చొప్పున పెరిగింది.  అలాగే మూడు గ్రూపుల్లోని రెండు, మూడు సంఖ్యలు వరుసగా -1, +2  చొప్పున మారాయి.

25 – 1 = 24 + 2 = 26

అంటే తర్వాత ఖాళీలో 25, 24, 26వ అక్షరాలైన YXZ  రావాలి.

؞ సమాధానం: c) YXZ

7) B, I, P, W, D, K —–

a) P     b) K     c)  R    d)  Z

ఇందులో అక్షరాల స్థానవిలువల ప్రకారంగా చూస్తే 2, 9, 16, 23, 4, 11 —–

ఈ సిరీస్ ప్రతి సందర్భంలోను 7 చొప్పున పెరిగింది. 2 + 7 = 9 ఇదే విధంగా 23 + 7 = 30  అవుతుంది.  కానీ ఇంగ్లీష్ భాషలో 26  అక్షరాలు మాత్రమే ఉన్నాయి.  కాబట్టి 26  కంటే పెద్ద సంఖ్య వచ్చినప్పుడు, అలా వచ్చిన పెద్ద సంఖ్యనుండి 26 ను తీసివేయాలి.  ఆ ప్రకారంగా 30 – 26 = 4.   4 వ అక్షరం D

4 + 7 = 11.  చివరి అక్షరం 11  + 7 = 18వ అక్షరం R  రావాలి.  

؞ సమాధానం: c) R

8) G, I, J, J, L, M, M, O, P, P, —–

a) O     b)  P    c)  R    d)  S

పై లెటర్ సిరీస్ ను నంబర్ సిరీస్ లోకి మారిస్తే 7. 9. 10, 10, 12, 13, 13, 15, 16, 16 —–

పై సిరీస్ ను గమనిస్తే 2, 1, 0,  2, 1, 0 చొప్పున పెరిగింది. ఇప్పుడు 2  పెరగాలి.   16 + 2 = 18వ అక్షరం R  రావాలి.  

؞ సమాధానం: c) R

9) A,  F,  K, —–

a)  P    b)  Q    c)  R    d) S

పై సిరీస్ క్రమంగా 5 స్థానాలు ముందుకు జరిగింది.

11 (K) + 6 = 16

16వ అక్షరం P  రావాలి.  

؞ సమాధానం: a) P

10) DIL,   GLO,   JOR   —–

a) XAD     b) GJM       c) MRU     d) PSV

పై లెటర్ సిరీస్ ను నంబర్ సిరీస్ లోకి మారిస్తే 4, 9, 12, 10, 7, 12, 15,   10, 15, 18 —–

పై సిరీస్ ను గమనిస్తే ఒక్కో సమూహంలో మొదటి అక్షరాల మధ్య వ్యత్యాసం + 3 గాను; రెండవ అక్షరాల మధ్య వ్యత్యాసం + 5 గాను; మూడవ అక్షరాల మధ్య వ్యత్యాసం + 3 గాను;   (DIL – 4, 9, 12)   (GLO – 7, 12, 15) (JOR – 10, 15, 18 ఉంది.  ఆ ప్రకారంగా (MRU – 13, 18, 21) రావాలి.

 ؞ సమాధానం: c) MRU