భాజనీయత సూత్రాలు – Principles of Divisibility

ఏదైనా ఒక సంఖ్యను మరో సంఖ్యతో భాగించకుండా ఆ సంఖ్య ఏ సంఖ్యల చేత నిశ్శేషంగా భాగింపబడుతుందో లేదా ఏ సంఖ్య చేత నిశ్శేషంగా  భాగింపబడదో తెలుసుకోవడానికి ఉపయోగించే సూత్రాలే భాజనీయత సూత్రాలు.  వీటిని తెలుసుకోవడం వలన ఇచ్చిన సంఖ్య ఫలానా సంఖ్య ద్వారా భాగిస్తుందో లేదో చూడగానే చెప్పవచ్చు.  ఇప్పుడు ఈ సూత్రాలను పరిశీలిద్దాం.

‘2 ‘ భాజనీయత సూత్రం

సరిసంఖ్యలన్నీ 2 తో నిశ్శేషంగా భాగించవచ్చు. లేదా ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8  లలో ఎదో ఒకటి ఉంటే అది 2 తో నిశ్శేషంగా భాగించవచ్చు.  ఉదా: 7374 ఒకట్ల స్థానంలో 4 ఉంది. కాబట్టి దీనిని 2 తో భాగించవచ్చు. 5879 –  ఇందులో ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8  ల్లో ఏ సంఖ్యా లేదు.  కాబట్టి దీనిని 2 తో భాగించలేం. 

‘3 ‘ భాజనీయత సూత్రం

ఒక సంఖ్యలో అంకెల మొత్తం 3  తో భాగింపబడితే ఆ సంఖ్య 3  చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఉదా: 4761. ఈ సంఖ్యలోని  అంకెల మొత్తం =  4 + 7 + 6 + 1 = 18  ని 3 తో నిశ్శేషంగా భాగించవచ్చు. కాబట్టి ‘4761’ ని 3 తో నిశ్శేషంగా భాగించవచ్చు. 5879 ఈ సంఖ్యలో అంకెల మొత్తం = 5 + 8 + 7+ 9 = 29  ని 3 తో నిశ్శేషంగా భాగించలేం. కాబట్టి ఈ సంఖ్య  ని 3  తో నిశ్శేషంగా భాగించలేం. 

‘4 ‘ భాజనీయత సూత్రం

ఒక సంఖ్యలో పదుల, ఒకట్ల స్థానాలలో రెండు సున్నాలు ఉన్నా, లేదా పదుల, ఒకట్ల స్థానాలలో ఉన్న సంఖ్య 4 తో భాగింపబడితే  ఆ సంఖ్య 4 తో నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఉదా: 87600 ఈ సంఖ్యలో చివరి రెండు స్థానాలైన పదులలో, ఒకట్లలో రెండు సున్నాలున్నాయి.  కాబట్టి  ఈ సంఖ్యని 4 తో నిశ్శేషంగా భాగించవచ్చు.  7936 ఈ సంఖ్యలో చివరి రెండు స్థానాలైన పదులలో, ఒకట్లలో ఉన్న సంఖ్య 36.   ‘36’ ని 4  తో నిశ్శేషంగా భాగించవచ్చు.  కాబట్టి  7936 ని కూడా 4 తో నిశ్శేషంగా భాగించవచ్చు.  84721 ఈ సంఖ్యలో చివరి రెండు స్థానాలైన పదులలో, ఒకట్లలో ఉన్న సంఖ్య 21.  .   21 ని 4  తో నిశ్శేషంగా భాగించలేం. కాబట్టి  84721  ని కూడా 4 తో నిశ్శేషంగా భాగించలేం. 

‘5 ‘ భాజనీయత సూత్రం

ఒక సంఖ్యలోని  ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ  ఉంటే ఆ సంఖ్యని 5 తో నిశ్శేషంగా భాగించవచ్చు. ఉదా: 47350,  63465 ఈ రెండు సంఖ్యలలో ఒకట్ల స్థానాలలో 0, 5 లు  వరుసగా ఉన్నాయి.  కాబట్టి ఈ రెండు సంఖ్యలను 5 తో నిశ్శేషంగా భాగించవచ్చు.  64728 ఈ సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0  కానీ, 5  కానీ లేదు. కాబట్టి ఈ సంఖ్యని  5  తో నిశ్శేషంగా భాగించలేం.

‘6 ‘ భాజనీయత సూత్రం

6  కు ప్రత్యేకంగా భాజనీయత సూత్రం లేదు. కానీ 6  ను 2×3 గా రాయొచ్చు. అంటే ఒక సంఖ్య ‘2’, ‘3’ తో భాగింపబడినట్లయితే ఆ సంఖ్యని ‘6’ తో కూడా నిశ్శేషంగా భాగించవచ్చు. లేదా ఒక సంఖ్యలోని  ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 లలో ఎదో ఒకటి ఉంటూ, ఆ సంఖ్యలోని  అంకెల మొత్తం ‘3’ తో భాగింపబడినట్లయితే, ఆ సంఖ్యని ‘6’ తో కూడా నిశ్శేషంగా భాగించవచ్చును.  ఉదా: 8472  – ఈ సంఖ్యలో ఒకట్ల స్ధానంలో ‘2’ ఉంది కాబట్టి ఈ సంఖ్యని ‘2’ తో నిశ్శేషంగా భాగించవచ్చును. ఈ సంఖ్యలో అంకెల మొత్తం = 8 + 4 + 7 + 2 = 21  ‘21’ ని  ‘3’ తో నిశ్శేషంగా భాగించవచ్చును. 8472 అనే సంఖ్యను 2, 3 తో భాగించవచ్చును.  కాబట్టి ‘6’ తో కూడా భాగించవచ్చును. 

‘7 ‘ భాజనీయత సూత్రం

ఇచ్చిన సంఖ్యలోని చివరి అంకెని మినహాయించి, దానిని  రెట్టింపు చేసి మిగతా సంఖ్య నుంచి తీసివేయాలి. వచ్చిన ఫలితంలోనుంచి చివరి అంకెని మినహాయించి, దానిని  రెట్టింపు చేసి మళ్ళీ మిగతా సంఖ్య నుంచి తీసివేయాలి. చివరి వరకు ఆ విధంగా చేసిన తరువాత మిగిలిన సంఖ్య ‘7’ తో భాగితమైతే ఆ సంఖ్య కూడా ‘7’ తో భాగితమవుతుంది.  ఉదా: 488894

48889꠰4

  (-)   8

———

   4888꠰1

   (-)  2

———-

      488꠰6

   (-) 12

———–

       47꠰6

  (-) 12

———–

        35

35 చివరకు  మిగిలింది. ‘35’,   ‘7’  తో  భాగితమౌతుంది కాబట్టి 488894 కూడా 7 తో   భాగితమౌతుంది.

‘8 ‘ భాజనీయత సూత్రం

ఒక సంఖ్య చివరి మూడు స్ధానాలలో మూడు సున్నాలు ఉన్నా, లేదా చివరి మూడు స్ధానాలలో ఉన్న సంఖ్య ‘8’ చేత భాగించబడినా ఆ సంఖ్యని ‘8’ చేత నిశ్శేషంగా భాగించవచ్చును. ఉదా:   567000 –  చివర మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్యని ‘8’ తో నిశ్శేషంగా భాగించవచ్చును. మరొక ఉదా: 46752  – చివరి మూడు స్ధానాలలో ఉన్న సంఖ్యని ‘8’ తో భాగించవచ్చును. కాబట్టి ఈ సంఖ్యని కూడా ‘8’ చేత నిశ్శేషంగా భాగించవచ్చును. 

‘9 ‘ భాజనీయత సూత్రం

ఒక సంఖ్యలోని  అంకెల మొత్తం ‘9’ చేత భాగించబడినట్లయితే, ఆ సంఖ్యని కూడా  ‘9’ చేత నిశ్శేషంగా భాగించవచ్చును. ఉదా: 421758 – ఈ సంఖ్యలో అంకెల మొత్తం = 4 + 2 + 1 + 7 + 5 + 8 = 27. ’27’ ని ‘9’ చేత నిశ్శేషంగా భాగించవచ్చును.  కాబట్టి ఈ సంఖ్యను కూడా ‘9’ చేత నిశ్శేషంగా భాగించవచ్చును.

’10 ‘ భాజనీయత సూత్రం

ఒక సంఖ్యలోని  ఒకట్ల స్ధానంలో అంకెల  ‘0’ ఉన్నప్పుడు మాత్రమే, ఆ సంఖ్యని కూడా  ’10’ చేత నిశ్శేషంగా భాగించవచ్చును. ఉదా: 4320 – ఈ సంఖ్యలో ఒకట్ల స్ధానంలో  ‘0’ ఉంది   కాబట్టి ఈ సంఖ్యను కూడా ’10’ చేత నిశ్శేషంగా భాగించవచ్చును.

’11 ‘ భాజనీయత సూత్రం

సంఖ్యలోని సరి స్ధానాల మొత్తం, బేసి స్ధానాల మొత్తాల వ్యత్యాసం సున్నా లేదా 11 గుణిజం అయితే   ఆ సంఖ్య 11 తో నిశ్శేషంగా భాగితమవుతుంది. ఉదా:  2   7   0    9   5   2

2 + 0 + 5 = 7

7 + 9 + 2 = 18

18 – 7 = 11

వీటి వ్యత్యాసం 11

11 గుణిజం కాబట్టి 270952  11 తో నిశ్శేషంగా భాగితమవుతుంది.