తొలిబడి (Toli Badi)

తొలిబడి

మా అమ్మఒడి నా తొలిబడి

నాకు మాటలు నేర్పి,మా కుటుంబాన్ని పరిచయం చేసిన అమ్మ నాకు తొలి గురువు, అమ్మ ఒడి నాకు తొలిబడి. అమ్మనేర్పిన బంధుత్వాలతోనే నేను అందరిని పిలుస్తున్నాను.  నాపేరు కూడా నాకు చెప్పినది, నేర్పినది అమ్మ.  నన్నెత్తుకుని, నడిపించి, పరుగెత్తించినది నాన్న.  నాకు ఏమి కావలసిన ఇచ్చి నా  వేలుపట్టుకుని  అక్షరాలు దిద్దించి నాకు అక్షరాభ్యాసం చేసిన  మా నాన్న అంటే కూడా నాకు ఇష్టం.   మా తమ్ముడు నేను ఎప్పుడైనా తగవులు పడితే మా నానమ్మ, తాతగారు మమ్మల్ని ఒడిలో కూర్చోపెట్టుకుని మేము తగవులు పడకూడదని సఖ్యతగా ఉండాలని చెప్తారు. మా కుటుంబం అంటే నాకందుకే ఇష్టం.  నాకు  ఉదయాన్నే లేవాలని, లేచిన వెంటనే పళ్ళు తోముకోవాలని, ముఖం కడుక్కోవాలి అని  మా అమ్మ అలవాటు చేసింది. నేను ఉదయం లేచిన తర్వాత మా తాత గారికి, మామ్మకి , నాన్నకి, అమ్మకి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను.  తర్వాత స్నానం చేసి స్కూలుకి వెళతాను. నాకిన్ని మంచి విషయాలు నేర్పిన మాఅమ్మ నా తొలిగురువు, మా ఇల్లు మా అమ్మఒడి నా తొలిబడి.