విఘ్నేశ్వర ప్రార్ధన (Vighneswara Prardhana)

Ganapathi Pedda Baala Siksha
Peddabaalasiksha.com

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే||

తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

గణాధిప నీకు మ్రొక్కెదన్!

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

మూషికవాహన మోదకహస్త

చామరకర్ణ విలంబిత సూత్ర|

వామనరూప మహేశ్వరపుత్ర

విఘ్న వినాయక పాద నమస్తే||

గజాననం భూతగణాదిసేవితం కపిత్త జంబూఫల సారభక్షితం|

ఉమాసుతంశోక వినాశ  కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం||

సుముఖస్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః|

ధూమకేతు గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః||