సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ – విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణినీ – నిత్యం పద్మాలయాం దేవీ సామాంపాతు సరస్వతీ
చంద్రయాన్-3 | Chandrayaan-3 – పెద్ద బాల శిక్ష (peddabaalasiksha.com)
చంద్రయాన్ -3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రుని యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.
ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ చంద్రయాన్ -3 కార్యక్రమాన్ని ప్రకటించారు.
చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు.
Aasu Kaburlu – Blog Posts
No post found!
సినిమా పాటల సాహిత్యంపై విశ్లేషణ – Blog Posts
బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ
బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగ కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ సీతారామయ్య గారి మనవరాలు సినిమా ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న చిన్న నవల ‘నవ్వినా…
ఆలోకయే శ్రీ బాలకృష్ణం
ఆలోకయే శ్రీ బాలకృష్ణం కన్నయ్య ని ఎంతమంది ఎన్ని రకాలుగా కొలిచారో కదా, విచిత్రంగా కన్నయ్య మీద ఎవరు పాట కానీ పద్యం కానీ, శ్లోకం కానీ ఏమి రాసినా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అది కన్నయ్య లీలే అంటా….
అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి…
అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి… సప్తపది, 1981లో విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది….
ఆదిభిక్షువు
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు వాన బొట్టు ఆల్చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ…