ఆ.సు. కబుర్లు : బబ్బు గాడి ఒలంపిక్స్ హితోపదేశం

బబ్బు గాడి ఒలంపిక్స్  హితోపదేశం “తాత……గారు! కాఫీ” అంటూ  వచ్చాడు  బబ్బు. “కూర్చో బబ్బు! ఒలింపిక్స్ లో  మన  పరిస్తితి  పెద్దగా లేదు.” దిగులుగా  అన్నాను.  “ఆ పోనిద్దూ! ఈ  వార్త  చిన్నప్పట్నించి  నాలుగేళ్ల కోసారి  వినేదేగా! ఆ  ఒలింపిక్స్ లో  చాలా  ఆటలు  నాకు  అర్ధం కావు! అర్ధం  కాని  ఆటల్లో  మెడల్స్  గూర్చి  చింతన  ఏల?” అన్నాడు  బబ్బు.  “బబ్బు! ఒలింపిక్స్ లో  కొన్ని  ఈవెంట్స్  నాకూ  అర్ధం  కావనుకో. అంత మాత్రానికే  మెడల్స్  పట్టించుకోకపొతే  ఎలా?” అన్నాను. బబ్బు  చిన్నగా  నవ్వి  అన్నాడు.  “మన […]

ఆ.సు. కబుర్లు : బబ్బు గాడి ఒలంపిక్స్ హితోపదేశం Read More »

ఆ.సు. కబుర్లు : కోకు “అసలు మాది కిష్కింధ”

కోకు “అసలు మాది కిష్కింధ” ‘కోకు’ గా ప్రసిద్ధికెక్కిన కొడవటిగంటి కుటుంబరావుగారు తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న రచయిత. ఆయన రచించిన కథలు, నవలలు మధ్య తరగతి జీవితానికి దర్పణలు వంటివి. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన కుటుంబరావుగారు బాల్యం నుంచే రచనా వ్యాసంగంపై మక్కువ చూపారు. గురజాడ తర్వాత వ్యావహారిక భాషలో రచనలను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన రచయితలల్లో కుటుంబరావుగారు ప్రముఖులు. ఆయన రచనలలో మధ్యతరగతి జీవితాలు ప్రతిబింబిచడతంతోపాటు, సామాజిక స్పృహ, దృక్పధం

ఆ.సు. కబుర్లు : కోకు “అసలు మాది కిష్కింధ” Read More »

ఆ.సు. కబుర్లు : అంతులేని అనంత భువనమంత క్షౌరశాల

అంతులేని అనంత భువనమంత క్షౌరశాల గంగిగోవు పాలు గరిటడైనను చాలు – ఆ గరిటెడు జుట్టు పెరుగుట చేత ఓ క్షౌరశాలలో అడుగు పెట్టాను. ఈ క్షౌరశాలల్లోకి అడుగు పెట్టాలంటే నాకు కొంచెం సిగ్గు, బిడియం. పూలమ్మిన చోటనే కట్టెలమ్మడం ఎవరికయినా తలవంపులే కదా. అందుకు ఎవరిని కాదు నన్ను నేనే నిందించుకోవాలి.  విషయం ఏమిటంటే నాకు ఒత్తుగా జుత్తున్న రోజుల్లో – మాఇంటి దగ్గర్లో ఒక బ్యాంక్ ఉద్యోగస్తుడొకాయన వుండేవాడు. పేరు శాస్త్రి, వయసు నలభైకి

ఆ.సు. కబుర్లు : అంతులేని అనంత భువనమంత క్షౌరశాల Read More »

ఆ.సు. కబుర్లు : “కళ్యాణి” రాగం

నాపేరు అగ్నిష్ట శర్మ. మా గురువుగారి పేరు గిరీశం. బుద్ధునికి బోధి చెట్టు క్రింద జ్ఞానోదయం కలిగితే మా గురువు గారికి తాటిచెట్టు క్రింద జ్ఞానోదయమైంది. మేము ఉంటున్నది ఆంధ్రుల రాజధానిగా ప్రచారంలో ఉన్నఅమరావతికి కొద్ది దూరంలో ఉన్న కనక దుర్గమ్మ గారి నివాస స్ధలమైన బెజవాడ. మా గురువు గారు మాకు విద్యా బుద్ధులు నేర్పేది, జ్ఞాన బోధ చేసేది ‘తాళప్రస్ధ మందిరంలోని కల్లు మండపంలో’ కాబట్టే మాకు కళ్లు తిరిగే జ్ఞానం లభిస్తే మాద్వారా మిగిలిన ప్రజలకు వారి వారి ప్రాప్తజ్ఞత బట్టి కళ్లు, కాళ్ళు కూడా పోయేంత జ్ఞాన సిద్ధి కలుగుతోంది. మా తాళప్రస్ధ సుందరీకరణ జరుగుచున్నందున మేము మా జ్ఞానాన్ని వేరే చోట నేర్చుకోవలసి వస్తోంది. అందులో భాగంగా మా గురువు గారికి సమకాలీన స్నేహితులైన ‘చయనులు’ గారిచే నిర్వహించబడుచున్న “సురప్రాప్తి” సమశీతోష్ణ మందిరంలో మాకు విద్యాబోధన జరుగుతోంది.

ఆ.సు. కబుర్లు : “కళ్యాణి” రాగం Read More »

ఆ.సు. కబుర్లు : అప్పు మంచిదే

ఆంద్ర రాష్ట్రంలో అత్యధికంగా ప్రజాదరణ కలిగిన ‘అగ్నిహోత్రం’ దిన, వార పత్రికలకు ఎడిటర్ మన ‘భావావేశం’. ఈయన గారు ‘గిరీశం’ వీరాభిమాని. గురజాడ గారు ఎంత బూస్ట్ అప్ చేసినా ‘గిరీశం’ కి రావలసినంత ఆదరణ రాలేదని మన ‘భావావేశం’ గారి అభి ప్రాయం. ‘నాతో మాట్లాడ్డమే ఒక ఎడ్యుకేషన్’ అన్న గిరీశం సూక్తిని బాగా ఒంటపట్టించుకుని తాను కూడా గిరీశం అంతటివాడేనన్నఅభిప్రాయంతో బతికేస్తున్న స్వాభిమాన జీవి. ఇంకొక విషయం ఏమిటంటే మన భావావేశంకి తెలుగు భాషాభిమానం ఎక్కువే. అలాగే తెలుగు ప్రజలపైన అచంచల విశ్వాసం, గౌరవం కూడా. ‘తెలుగు వారికి తెలుగువారే సాటి’ అని వేరేవారు తెలుగువారికి సాటి రాలేరని బాగా నొక్కి వక్కాణించి చెప్పేడు.

ఆ.సు. కబుర్లు : అప్పు మంచిదే Read More »

ఆ.సు. కబుర్లు : ప్రారబ్ధం

తెలుగువాడికి సాటి తెలుగు వాడే. అందరూ ఒక దారిలో వెళితే తెలుగువాడు ఆ దారిలో వెళ్ళడు. అందరూ పొగ పీలిస్తే తెలుగువాడు పొగ తాగుతాడు. ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. సంస్కృతాన్ని అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా ‘సచ్చినోడా’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు. చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? తెలుగువాడు కంటిచూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది.

ఆ.సు. కబుర్లు : ప్రారబ్ధం Read More »

ఆ.సు. కబుర్లు : పుచ్చిన జ్ఞానదంతం

ఒక రోజు మధ్యాహ్నం వీధిలో ఇళ్ళదగ్గర పారేసిన ఆకులు, కాయలు వగైరా తింటూ ఆవు కనిపించింది అంతే ఎప్పుడు దాని పాలు తాగుదామా అని చూస్తున్న నాకు నా ఆలోచన అమలు చేయాలనిపించింది. వీధిలో ఎవరూ కనపడలేదు సరే నా టైము బాగుందని మెల్లగా ఆవు పొడుగు దగ్గర కూర్చుని నెమ్మదిగా దాని శిరాలు అందుకోవాలని ప్రయత్నం చేసేను ముందు అందలేదు కానీ తీరా అంది నేను నోట్లో పెట్టుకున్నానో లేదో ఫెడీమని వెనక కాలుతో ఓ తన్ను తన్ని ముందుకు వెళ్ళిపోయింది. నేను క్రింద పడి పన్నూడి నోట్లోంచి రక్తం వస్తుండగా ఇంట్లోకి వెళ్లిపోయెను.

ఆ.సు. కబుర్లు : పుచ్చిన జ్ఞానదంతం Read More »