చంద్రయాన్-3 | Chandrayaan-3

చంద్రయాన్ -3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రుని యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.

చంద్రయాన్-3 | Chandrayaan-3 Read More »

విధాత తలపున ప్రభవించినది

విధాత తలపున ప్రభవించినది సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పదాల వెంట కాకుండా, భావాల వెంట పరుగులు తీస్తుంది. ఆయన భావాల వంతెన మీద నడిస్తే ఎలాంటి ఉధృతమైన వాగులనైనా సులభంగా దాటగలం. ఎందుకంటే ఆయన పాట అనుభవసారం. విధాత తలపున ప్రభవించిన అనాది జీవనరాగాల తాలూకు భావాల అనుభూతిని సీతారామ శాస్త్రి కవిత్వీకరించారు. వ్యక్తిత్వ వికాసం… ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట. వక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలంటే ఏం చేయాలి? వైవిధ్యంగా ఆలోచించాలి. నలుగురినీ కలుపుకొని పోవాలి.

విధాత తలపున ప్రభవించినది Read More »

వెన్నెల్లో గోదారి అందం

వెన్నెల్లో గోదారి అందం ‘సితార’ పూర్ణోదయా మూవీస్ పతాకంపై వంశీ దర్శకత్వంలో, సుమన్, భానుప్రియ, శరత్ బాబు, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలనచిత్రం. ఒకప్పుడ గొప్పగా వెలిగి ఆరిపోయిన రాజాస్థానాలలో ఒకదాని యజమాని చెల్లెలు సితార (భానుప్రియ). ఆమెను గొప్ప జమిందారుకు ఇచ్చి పెళ్ళీ చేయాలని అనుకుంటాడు ఆమె అన్న. ఆ సంస్థానానికి పగటి వేషగాళ్ళుగా వచ్చిన వారిలో కల ఒక వ్యక్తిని (సుమన్) ప్రేమిస్తుంది సితార. కాని అతడితో పెళ్ళి

వెన్నెల్లో గోదారి అందం Read More »

వేదం అణువణువున నాదం

వేదం అణువణువున నాదం నాట్యం  ఇతివృత్తంగా తీసిన సినిమాలో నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది.  ముఖ్యంగా కథ ఏమిటంటే  బాలకృష్ణ (కమల్ హాసన్) అనే పేద యువకుడు స్వయంకృషితో నాట్యం నేర్చుకొంటాడు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రవీణుడౌతాడు. కాని వాణిజ్యం, విచ్చలవిడితనం పెచ్చుమీరిన సినిమా రంగంలో ఇమడలేకపోతాడు. అతని ప్రతిభను గుర్తించిన మాధవి (జయప్రద) అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలో మహామహుల సమక్షంలో

వేదం అణువణువున నాదం Read More »

వాగ్దానం – హరికథ

వాగ్దానం – హరికథ కథాబలం కలిగిన కొన్ని గొప్ప సినిమాలు బాక్సాఫీసువద్ద ఎందుకు విఫలమవుతాయో అంతుతెలియని ప్రశ్న. ఆ కోవకి చెందిన సినిమా కవితా చిత్ర నిర్మాణతలో వచ్చిన ‘వాగ్దానం’(1961). కె.సత్యనారాయణ, డి.శ్రీరామమూర్తి నిర్మాతలుగా మనసు కవి ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా, ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌ బాబు 1918లో రచించిన ‘దత్త’ నవలకు తెరరూపం. హేమాహేమీలైన అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, రేలంగి, చలం, కృష్ణకుమారి, సూర్యకాంతం, గిరిజ వంటి నటీనటవర్గంతో నిర్మించిన

వాగ్దానం – హరికథ Read More »

తూరుపు సింధూరపు

తూరుపు సింధూరపు పదం కాదది, ప్రపంచానికి మేలుకొలుపు. పాట కాదది, ప్రజ్వరిల్లే జీవక వేదం. లోకం బాధంతా తన బాధనుకుని, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మరో ప్రపంచానికి స్వాగతం పలికిన శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, సాహితీ జగత్తుకే మణిహారం. తన అభ్యుదయ కవిత్వాల ద్వారా సమాజంలో కుళ్లుని తూర్పార బట్టిన శ్రీశ్రీ, ఎన్నో కమనీయమైన చిత్ర గీతాలను కూడా సినీ అభిమానులకు అందించారు. కత్తిలాంటి పదునైన మాటనైనా,

తూరుపు సింధూరపు Read More »

తరలి రాద తనే వసంతం

తరలి రాద తనే వసంతం అమ్మ జోలపాటలో రాగమెంత ఉన్నది, పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది… కోయిలే తాళం, పైరగాలే మేళం.. మమతే రా… మమతే రాగం, శ్రమజీవనమే భావం…. ఆహూ ఊహు రోకటి పాటలో లేదా మధుర సంగీతం…. జనబాహుళ్యానికి చేరని సంగీతమెందుకు అని ఒక సంగీత విద్వా౦సుడిని  ప్రశ్నిస్తుంది ఒక అమ్మాయి. బ్రతుకున లేని శృతి కలదా… ఎద సడిలోనా లయలేదా? ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా? వెన్నెల

తరలి రాద తనే వసంతం Read More »

శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వా

శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వా “మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది?” అని అడుగుతుంటారు చాలామంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేను నేను. రాసిన ప్రతి పాటా పదిమంది మెప్పు పొందాలని ఆశించడం తప్పుకాదు కానీ అలా జరగడం సాధ్యం కాదు. రాసేటప్పుడు, ఈ పాట తప్పకుండా హిట్ అవుతుంది కాబట్టి గొప్పగా రాయాలి, ఈ పాట పురిట్లోనే సంధికొట్టి చస్తుంది కనుక దీనికి పెద్దగా శ్రమపడక్కర లేకుండా ఏదో గీకి

శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వా Read More »

రామచక్కని సీతకి

రామచక్కని సీతకి జగతికి సుగతిని సాధించిన తల దిగంతాలకవతల వెలిగే తల…. అచ్చెరువున అచ్చెఱువున  విచ్చిన కన్నుల చూడ పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు అల్లన మ్రోవికి తాకితే గేయాలు ప్రతి భారత సతి మానం చంద్రమతీ మాంగల్యం మాగాయే మహా పచ్చడి  పెరుగేస్తే మహత్తరి అదివేస్తే అడ్డా విస్తరి మానిన్యాం మహాసుందరి ఇటువంటి విన్యాసాలు చేసి ముక్కున  వేలేయించగల, గుండెలు జలదరించి, మనసు పునాదుల్ని కుదిపేసినా, గోపాలా మ స జ స త త గ

రామచక్కని సీతకి Read More »

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ Read More »